ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ యంగ్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్. గత సీజన్ ఆఖర్లో వెలుగులోకి వచ్చిన ఉమ్రాన్ మాలిక్, ఈ సీజన్‌లోనూ వరుసగా 150+కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేస్తూ అందర్నీ ఇంప్రెస్ చేస్తున్నాడు...
ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో మెరుపు బౌలింగ్‌తో వరుసగా ‘ఫాస్టెస్ట్ డెలివరీ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుస్తూ పోయినా, వికెట్లు తీయలేకపోయాడు...
212
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...
312
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చిన ఉమ్రాన్ మాలిక్, 5 వికెట్లు తీసి అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు..
412
8 మ్యాచుల్లో 15 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచిన ఉమ్రాన్ మాలిక్‌ని టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆడించాలని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
512
టీమిండియా మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, వసీం జాఫర్ కూడా ఉమ్రాన్ మాలిక్‌కి వీలైనంత త్వరగా భారత జట్టులో చోటు కల్పించి, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి సిద్ధం చేయాలని కామెంట్లు చేశారు..
612
అయితే భారత మాజీ క్రికెటర్ ఆర్‌పీ సింగ్ మాత్రం ఉమ్రాన్ మాలిక్‌ని ఇప్పుడే టీ20 వరల్డ్ కప్ ఆడించడం కరెక్ట్ కాదని అంటున్నాడు. ‘ఉమ్రాన్ మాలిక్‌లో చాలా టాలెంట్ ఉంది. అతను కచ్ఛితంగా టీమ్‌లో ఉండాల్సినవాడే...
712
ఉమ్రాన్ మాలిక్ లాంటి ప్లేయర్, టీమ్‌లో ఉంటే రిజర్వు బెంచ్ బలంగా మారుతుంది. అతని అవసరం ఎప్పుడు వస్తుందో తెలీదు. కానీ మాలిక్ లాంటి ప్లేయర్‌ని కరెక్టుగా వాడుకోవాలి...
812
ఇప్పుడే అతన్ని అంతర్జాతీయ స్థాయిలో ఆడించడం కరెక్ట్ కాదు. నాకు అతనితో ఎలాంటి విరోధం లేదు కానీ ఉమ్రాన్ మాలిక్ పెద్దగా దేశవాళీ క్రికెట్ ఆడలేదు, ఐపీఎల్ అనుభవం కూడా చాలా తక్కువే...
912
ఉమ్రాన్ మాలిక్ ఘనంగా ఐపీఎల్ కెరీర్‌ని మొదలెట్టాడు, దాన్ని ఎవ్వరం కాదనలేం. అయితే అతని ఎకానమీ రేటు మాటేంటి? వికెట్లు తీస్తున్నా ఉమ్రాన్ మాలిక్, చాలా ఎక్కువ పరుగులు ఇస్తున్నాడు...
1012
Umran Malik
8 కంటే ఎక్కువ ఎకానమీతో పరుగులు ఇస్తున్నాడు. మ్యాచు మ్యాచుకీ అతని ఆట మరింత మెరుగవుతోంది. ఉమ్రాన్ మాలిక్ జట్టుతో ఉంటే, వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్లకి నెట్స్‌లో బౌలింగ్ చేసే అవకాశం దొరుకుతుంది...
1112
అతనికి కావాల్సిన ప్రాక్టీస్ దొరికిన తర్వాత కరెక్ట్ ట్యూన్‌లోని వచ్చాక టీమిండియా తరుపున ఆడిస్తే బాగుంటుంది. అతని టీమిండియా ఫ్యూచర్. ఇప్పుడే ఆడించడం తొందరపాటు అవుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు ఆర్‌పీ సింగ్...
1212
ఐపీఎల్ 2021 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత జట్టుకి నెట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు ఉమ్రాన్ మాలిక్... ఈ సారి కూడా మాలిక్‌కి టీమ్‌లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.