అన్ని మ్యాచులు గెలుస్తాం, అందరికీ చుక్కలు చూపిస్తాం... ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్...

Published : May 01, 2022, 03:53 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన జట్టు ముంబై ఇండియన్స్. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడపాదడపా మ్యాచులు గెలిచినా, ముంబై ఇండియన్స్ తొలి విజయం అందుకోవడం కోసం ఏకంగా 9 మ్యాచుల దాకా వేచి చూడాల్సి వచ్చింది...

PREV
18
అన్ని మ్యాచులు గెలుస్తాం, అందరికీ చుక్కలు చూపిస్తాం... ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్...

ముంబై ఇండియన్స్ వరుస పరాజయాల కారణంగా ఎక్కువ విమర్శలు ఎదుర్కొన్నది ఓపెనర్ ఇషాన్ కిషన్. ఐపీఎల్ మెగా వేలంలో రూ.15.25 కోట్లు పెట్టి మరీ ఇషాన్ కిషన్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...

28

మొదటి మ్యాచ్‌లో హఫ్ సెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషన్, ఆ తర్వాత వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు. 9 మ్యాచుల్లో కలిపి 225 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, 111.3 స్ట్రైయిక్ రేటుతో టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడాడు...

38

వరుసగా బ్యాటింగ్‌లో ఫెయిల్ అవుతుండడం, విజయాలు రాకపోవడంతో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మల ముఖాల్లో, ఆటలో ఫ్రస్టేషన్ కనిపించింది...

48

రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 159 పరుగుల లక్ష్యఛేదనలో రోహిత్ శర్మ వికెట్ త్వరగా కోల్పోయింది ముంబై ఇండియన్స్. అయితే ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.

58

‘ఈ విజయం మాకు చాలా అవసరం. 8 మ్యాచుల తర్వాత దక్కిన ఈ విజయం మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. జట్టుగా మేమంతా కలిసి కట్టుగా ఉన్నాం...

68

ఇంతకుముందు మ్యాచుల్లో మేం విజయం అందుకోకపోయినా బాగానే ఆడాం. కొన్ని సార్లు వికెట్లు త్వరగా కోల్పోవాల్సి వస్తుంది.

78

కొన్నిసార్లు వేగంగా పరుగులు చేయడానికి అవకాశం దొరుకుతుంది. క్రికెట్‌లో అన్నీ జరుగుతూనే ఉంటాయి... ప్రతీ బ్యాటర్ మ్యాచ్‌ని ఫినిష్ చేయాలనే కోరుకుంటాడు...

88

మాకు కావాల్సిన విజయం దక్కింది. ఇకపై మిగిలిన మ్యాచుల్లో గెలిచి, టోర్నీని టఫ్‌గా మార్చాలని అనుకుంటున్నాం. మిగిలిన టీమ్స్‌కి మేమేంటో చూపిస్తాం...’ అంటూ కామెంట్ చేశాడు ఇషాన్ కిషన్...

click me!

Recommended Stories