టీమిండియాలో అనిల్ కుంబ్లే-హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా తర్వాత స్పిన్ ద్వయంగా అనేక మ్యాచుల్లో విజయాలను అందించారు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్. కుల్‌చా (Kul-cha) జోడీగా పేరొందిన ఈ ఇద్దరూ 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత కలిసి ఆడింది చాలా తక్కువ...
2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీ తర్వాత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ కొన్ని టెస్టుల్లో ఆడినా, యజ్వేంద్ర చాహాల్ ఇప్పటిదాకా టెస్టు ఆరంగ్రేటమే చేయలేదు...
28
దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు ఈ కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ జోడిని తిరిగి కలిపాడు రోహిత్ శర్మ. శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ ఇద్దరూ కలిసి ఆడారు...
38
నాలుగేళ్లుగా భారత జట్టుకి వైట్ బాల్ క్రికెట్‌లో ప్రధాన స్పిన్నర్‌గా చాహాల్‌కి టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో చోటు దక్కకపోవడం తీవ్ర వివాదాస్పదమైంది... అశ్విన్ రీఎంట్రీ ఇచ్చినా, కీలక మ్యాచుల్లో అతనికి తుదిజట్టులో చోటు దక్కనేలేదు...
48
ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్... పర్పుల్ క్యాప్ రేసులో పోటీపడుతున్నారు. చాహాల్ 22, కుల్దీప్ 18 వికెట్లు తీసి 40 వికెట్లతో దుమ్మురేపుతున్నారు...
58
‘సెలక్టర్లు ఎందుకు కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్ జోడిని విడదీసారో నాకు ఇప్పటిదాకా అర్థం కావడం లేదు. టీమిండియాలోకి ఆ ఇద్దరినీ తీసుకురావాల్సిన అవసరం చాలా ఉంది...
68
టీమిండియాకి ఈ ఇద్దరూ అద్భుత విజయాలు అందించగలరు. కుల్‌చా జోడీకి టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు ఇవ్వాల్సిందే... సెలక్టర్లకి ఎలాంటి ఆప్షన్లు లేకుండా చేశారు ఈ ఇద్దరూ..
78
వాళ్లిద్దరూ కలిసి ఆడినప్పుడు టీ20ల్లో కానీ వన్డేల్లో కానీ మిడిల్ ఓవర్లలో కావాల్సిన వికెట్లు తీశారు. విడివిడిగా ఆడినప్పటి కంటే కలిసి ఆడినప్పుడు సూపర్ సక్సెస్ సాధించారు...
88
వారిద్దరూ విడదీయాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాలో భారత జట్టుకి ఈ ఇద్దరూ బలంగా మారుతారు. రోహిత్ శర్మ ఈ ఇద్దరినీ సపోర్ట్ చేస్తాడని ఆశిస్తున్నా...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్...