గ్రీన్ జెర్సీలో గెలిచారు, అంటే... ఆ లెక్కన ఆర్‌సీబీ ఈసారి ఫైనల్ చేరనుందా...

Published : May 08, 2022, 07:55 PM IST

ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీకి గ్రీన్ కలర్ జెర్సీ పెద్దగా అచ్చొచ్చింది లేదు. ప్రతీ యేటా ప్రజల్లో గ్లోబల్ వార్మింగ్, పచ్చదనంపై అవగాహన పెంచేందుకు గ్రీన్ కలర్ జెర్సీతో ఓ మ్యాచ్ ఆడుతూ వస్తున్న ఆర్‌సీబీ... స్పెషల్ జెర్సీలో గెలిచిన మ్యాచులు రెండే...

PREV
19
గ్రీన్ జెర్సీలో గెలిచారు, అంటే... ఆ లెక్కన ఆర్‌సీబీ ఈసారి ఫైనల్ చేరనుందా...

తొలిసారిగా 2011లో గ్రీన్ కలర్ జెర్సీలో బరిలో దిగిన ఆర్‌సీబీ, తొలి సీజన్‌లో స్పెషల్ జెర్సీలో ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2016 సీజన్‌లోనూ గ్రీన్ కలర్ జెర్సీ ఆర్‌సీబీకి అచ్చి వచ్చింది...

29

ఈ రెండు సీజన్లు మినహా మిగిలిన అన్ని సీజన్లలో గ్రీన్ కలర్ జెర్సీలో ఆడిన మ్యాచులన్నీ ఆర్‌సీబీకి పరాజయాన్నే మిగిల్చాయి. 2015 సీజన్‌లో గ్రీన్ కలర్ జెర్సీలో ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది...

39

తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రీన్ కలర్ జెర్సీలో బరిలో దిగి 67 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది ఆర్‌సీబీ. సీజన్‌లో ఏడో విజయంతో ప్లేఆఫ్స్‌కి మరింత చేరువైంది..

49

అయితే ఇంతకుముందు గ్రీన్ కలర్ జెర్సీలో మ్యాచ్ గెలిచిన రెండు సీజన్లలోనూ ఆర్‌సీబీ ఫైనల్ చేరడం విశేషం. 2011 సీజన్‌లో డానియల్ విటోరీ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన ఆర్‌సీబీ, టైటిల్ పోరులో సీఎస్‌కే చేతుల్లో ఓడింది...

59

ఆ తర్వాత 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది...

69

గతంలో గ్రీన్ కలర్ జెర్సీలో ఆడిన మ్యాచుల్లో గెలిచిన సీజన్లలో ఆర్‌సీబీ ఫైనల్ చేరడంతో ఈసారి కూడా బెంగళూరు ఫైనల్ చేరబోతుందని అంచనా వేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సారి అయినా ఫైనల్‌లో గెలిచి టైటిల్ గెలవాలని ఇప్పటి నుంచి పూజలు చేస్తున్నారు...

79

12 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాలంటే మిగిలిన 2 మ్యాచుల్లో కనీసం ఓ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. అయితే నెట్ రన్‌రేట్ తక్కువగా ఉండడంతో రెండింట్లో విజయాలు అందుకుంటే మిగిలిన జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది ఆర్‌సీబీ...
 

89

అయితే గత రెండు సీజన్లలో కూడా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన ఆర్‌సీబీ, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయింది. నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది...
 

99

మే 13న పంజాబ్ కింగ్స్‌తో, మే 19న గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులు ఆడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. పంజాబ్ కింగ్స్‌తో వరుసగా మ్యాచులు ఓడుతూ వస్తున్న ఆర్‌సీబీ, ప్లేఆఫ్స్ రేసులో బలం పుంజుకోవాలంటే ఈసారి విజయం సాధించాల్సి ఉంటుంది...  

Read more Photos on
click me!

Recommended Stories