ఎమ్మెస్ ధోనీని కాదు, గంభీర్‌ని టీమిండియా మెంటర్‌గా నియమించండి... లక్నో సూపర్ సక్సెస్‌తో...

First Published May 8, 2022, 7:20 PM IST

భారత జట్టు రెండు వరల్డ్ కప్స్ గెలవడానికి కారణం ఎవరు? కెప్టెన్‌గా ఎమ్మెస్ ధోనీ ఎక్కువ క్రెడిట్ కొట్టేసినా 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌తో పాటు 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో గౌతమ్ గంభీర్ ఆడిన ఇన్నింగ్స్‌లను ఏ మాత్రం తక్కువ చేయలేం. అందుకే ధోనీ అంటే గౌతమ్ గంభీర్‌కి పడదు, మాహీ ఫ్యాన్స్‌కి గౌతీ అంటే పడదు...

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ముందు టీమిండియాకి మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీని నియమించడం చాలా పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన కెప్టెన్, మెంటర్‌గా భారత జట్టుకి వరల్డ్ కప్ అందిస్తాడని ఆశించారంతా...

క్రికెట్ కామెంటేటర్లు, ధోనీ ఫ్యాన్స్ అయితే భారత జట్టు ప్లేయర్ల వార్మప్ మ్యాచుల్లో అదరగొడుతుంటే... అంతా మాహీ మహిమే అన్నారు. అయితే టోర్నీ మొదలయ్యాక సీన్ మొత్తం మారిపోయింది...

Latest Videos


టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో, ఆ తర్వాతి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో చిత్తుగా ఓడింది టీమిండియా. ఈ ఓటములతో మెంటర్ ధోనీతో పాటు మాహీ ఫ్యాన్స్ కూడా కనిపించకుండా పోయారు...

మరోవైపు ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి మెంటర్‌గా నియమితుడయ్యాడు గౌతమ్ గంభీర్. కెప్టెన్సీ రాని కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా, గంభీర్‌ని మెంటర్‌గా నియమించడంతో ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ని ఆరంభించింది లక్నో సూపర్ జెయింట్స్...

అయితే 11 మ్యాచులు ముగిసే సమయానికి 8 విజయాలు అందుకున్న లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌లోకి దూసుకెళ్లింది. గుజరాత్ టైటాన్స్ తర్వాత ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది...

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా, సౌతాఫ్రికా టూర్‌లో భారత జట్టు తాత్కాలిక సారథిగా వ్యవహరించిన ఒక్క విజయం కూడా అందుకోలేకపోయిన కెఎల్ రాహుల్... లక్నో సూపర్ జెయింట్స్‌ని టాప్‌లో నిలబెట్టాడంటే అతని సక్సెస్ వెనక కోచ్ ఆండీ ఫ్లవర్, మెంటర్ గౌతమ్ గంభీర్‌లు ఉన్నారనేది ఎవ్వరూ కాదనేలేని నిజం..

లక్నో సూపర్ జెయింట్స్ సూపర్ సక్సెస్‌తో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి గౌతమ్ గంభీర్‌ని భారత జట్టు మెంటర్‌గా నియమించాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు టీమిండియా అభిమానులు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ని విజయాల బాట పట్టించలేకపోయిన రోహిత్ శర్మకి గౌతమ్ గంభీర్‌ లాంటి క్రికెట్ జ్ఞాని తోడైతే... భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2022 సాధిస్తుందని పోస్టులు చేస్తున్నారు. వీరిలో వెటకారంగా గౌతీని పొడుగుతున్న మాహీ ఫ్యాన్స్ కూడా ఉండడం విశేషం..

అయితే టీ20 వరల్డ్ కప్ 2021 సీజన్‌లో ఎదురైన అనుభవాల కారణంగా వచ్చే సీజన్‌లో మెంటర్లను నియమించే సాహాసం బీసీసీఐ చేయకపోవచ్చని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదుసార్లు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడనుంది భారత జట్టు. దీంతో టీమిండియాపై ఈసారి కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

click me!