ఐపీఎల్ వల్ల డబ్బున్నోళ్లే బాగుపడుతున్నారు, అందుకే టీ20 బ్లాస్ట్ బెస్ట్... ఇంగ్లాండ్ లెజెండ్...

First Published May 24, 2022, 11:15 PM IST

ప్రపంచంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీ20 లీగ్ ఐపీఎల్. అయితే ఐపీఎల్‌కి దక్కుతున్న క్రేజ్, వస్తున్న పాపులారిటీ చూసి పొరుగుదేశాల వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. పక్కదేశం పాకిస్తాన్ తమ పీఎస్‌ఎల్ గొప్పదని ప్రగల్భాలు పలుకుతూ వచ్చింది. ఇప్పుడు ఈ లిస్టులోకి టీ20 బ్లాస్ట్ వచ్చి చేరింది...

వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఐపీఎల్ 2022 సీజన్‌లో రెండు అదనపు జట్ల విక్రయం ద్వారానే రూ.13 వేల కోట్లు ఖాతాలో వేసుకుంది బీసీసీఐ. ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా మరో రూ.40 వేల కోట్లు చేరనుంది...

సంపాదన విషయంలోనే కాకుండా ఐపీఎల్ ద్వారా జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఛేతన్ సకారియా... ఇలా కొన్ని వందల మంది యువ క్రికెటర్లు, ప్రపంచానికి పరిచయమయ్యారు...

2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్, 15వ సీజన్ నడుస్తుంటే... అంతకంటే ఐదేళ్ల ముందే  2003లో ప్రారంభమైంది ఇంగ్లాండ్ ఫస్ట్ క్లాస్ టీ20 బ్లాస్ట్ టోర్నీ...

టీ20 బ్లాస్ట్ 20వ సీజన్ ఆరంభ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డేవిడ్ లాయిడ్... ఐపీఎల్ కంటే టీ20 బ్లాస్ట్ బెస్ట్ టీ20 టోర్నీ అంటూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి..

‘నేను ఐపీఎల్‌లో కామెంటేటర్‌గా పని చేశాను. అదో ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్, అలెడ్రీ డబ్బులు ఉన్నవాళ్లకే బోలెడు డబ్బులు తెచ్చిపెడుతోంది. కానీ టీ20 బ్లాస్ అలా కాదు. ఇది జనాల కోసం..

Image credit: PTI

భారతీయులకు ఐపీఎల్ సూట్ అవుతుంది. వాళ్లు క్రికెటర్లను దేవుళ్లుగా పూజిస్తారు, క్రికెట్‌ని సీరియస్‌గా తీసుకుంటారు. అందుకే ది బ్లాస్ట్ వరల్డ్‌లో బెస్ట్ టీ20 టోర్నీ...

Mumbai Indians

 అయితే నేను క్వాలిటీ గురించి మాట్లాడడం లేదు, సుదీర్ఘ కాలంగా సాగుతుంది కాబట్టి దీన్ని బెస్ట్ అంటున్నాను... ’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ లాయిడ్...

click me!