నా కొడుకు అయినంత మాత్రాన టీమ్‌లోకి రాలేడు... అర్జున్ టెండూల్కర్‌పై సచిన్ కామెంట్...

Published : May 24, 2022, 08:39 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ నుంచి అరడజనుకు పైగా కొత్త కుర్రాళ్లు ఎంట్రీ ఇచ్చినా, సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్‌కి తుదిజట్టులో చోటు దక్కకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది...

PREV
113
నా కొడుకు అయినంత మాత్రాన టీమ్‌లోకి రాలేడు... అర్జున్ టెండూల్కర్‌పై సచిన్ కామెంట్...

ముంబై ఇండియన్స్‌ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన సచిన్ టెండూల్కర్, రిటైర్మెంట్ తర్వాత ఆ టీమ్ మెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. మాస్టర్స్ గైడెన్స్‌లోనే ముంబై ఇండియన్స్... ఐదు టైటిల్స్ గెలిచింది...

213

సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ చాలా ఏళ్లుగా ముంబై ఇండియన్స్ జట్టుతోనే ట్రావెల్ అవుతున్నాడు. నెట్‌ బౌలర్‌గా ఉన్న అర్జున్ టెండూల్కర్‌ని, ఐపీఎల్ 2021 వేలంలో తొలిసారి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్...

313

సచిన్ టెండూల్కర్ కుమారుడు కావడం వల్లే అర్జున్ టెండూల్కర్‌ని కొనుగోలు చేయడం లేదని, నెట్స్‌లో అతను పడుతున్న కష్టాన్ని నేరుగా చూడడం వల్లనే తీసుకున్నామని అప్పట్లో కామెంట్ చేశాడు ఆ జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్థనే...

413

ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలోనూ రూ.30 లక్షలకు అర్జున్ టెండూల్కర్‌ని కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఈసారి మొదటి 8 మ్యాచుల్లో ఓడిన ముంబై, ప్లేఆఫ్స్ రేసు నుంచి తొందరగానే తప్పుకుంది...

513

అదీకాకుండా ఈ సారి సరైన సీనియర్ ప్లేయర్లను కొనుగోలు చేయకపోవడంతో తిలక్ వర్మ, హృతిక్ షోకీన్, కుమార్ కార్తీకేయ వంటి కొత్త కుర్రాళ్లు ముంబై ఇండియన్స్ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేశారు...

613

ఆఖరి మ్యాచ్‌లో అయినా అర్జున్ టెండూల్కర్‌ని ఆడిస్తారని ఆశపడిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అర్జున్ టెండూల్కర్ కూడా అవకాశం రాకపోవడంతో ఎమోషనల్ అయ్యాడు...

713

ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే సచిన్ టెండూల్కర్ కొడుకు కావడం వల్ల అర్జున్ టెండూల్కర్‌కి పాకెట్ మనీగా గత సీజన్‌లో రూ.20 లక్షలు ఇచ్చిన అంబానీ, ఈ సీజన్‌లో రూ.30 లక్షలు ఇచ్చిందని ట్రోల్స్ చేస్తూ మీమ్స్ వైరల్ చేశారు...

813

తాజాగా రంజీ ట్రోఫీ నాకౌట్ ప్రాబబుల్స్‌లోనూ ముంబై జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు అర్జున్ టెండూల్కర్. అవకాశం ఇవ్వకుండానే అర్జున్‌ని తప్పించింది పృథ్వీషా కెప్టెన్సీలోని ముంబై జట్టు...

913

కొడుకుకి అవకాశాలు రాకపోవడంపై స్పందించాడు సచిన్ టెండూల్కర్... ‘అర్జున్ టెండూల్కర్‌కి అవకాశాలు రాకపోవడంపై నేనేమనుకుంటున్నాననేది ముఖ్యం కాదు... 

1013

నా ఫీలింగ్స్ కూడా ముఖ్యం కాదు. ఎందుకంటే కొడుకుకి అవకాశాలు రాకపోతే ఏ తండ్రి అయినా ఫీల్ అవుతాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మ్యాచులు కూడా అయిపోయాయి...

1113

నా కొడుకు అయినంత మాత్రాన అవకాశాలు రావు. ఈ విషయం వాడికి చిన్నప్పటి నుంచి చెబుతూనే పెంచా. ప్రతీ దారి ముళ్లతోనే నిండి ఉంటుంది. వాటిని తొక్కుకుంటూ వెళ్తావా? ముళ్లని తీసుకుంటూ వెళ్తావా... నీ ఇష్టం...

1213

నేను ఎప్పుడూ ముంబై ఇండియన్స్ టీమ్ సెలక్షన్‌లో చేతులు పెట్టలేదు. సెలక్షన్‌ అంతా టీమ్ మేనేజ్‌మెంట్ చూసుకుంటుంది. నేను కేవలం ప్లేయర్ల పర్ఫామెన్స్‌పైనే దృష్టి పెడతా...

1313

అర్జున్‌కి క్రికెట్ అంటే ఇష్టం, ప్రేమ. ఆ ప్రేమ కోసం కష్టపడితే అతనికి కచ్ఛితంగా అవకాశాలు వస్తాయి... ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...

Read more Photos on
click me!

Recommended Stories