అశ్విన్‌ని ఫుల్లుగా వాడేశారు, ఇలా కూడా బ్యాటింగ్ చేయగలడా... హర్భజన్ సింగ్ కామెంట్...

First Published May 24, 2022, 7:55 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆల్‌రౌండర్‌గా అదరగొట్టాడు రవిచంద్రన్ అశ్విన్. గత సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ వంటి జట్లకి ఆడిన అశ్విన్, ఈ సీజన్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కి స్పెషల్ ప్లేయర్‌గా మారిపోయాడు...

Ravichandran Ashwin

రవిచంద్రన్ అశ్విన్‌ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపి,ప్రయోగాలు చేసిన రాజస్థాన్ రాయల్స్ ఊహించని రిజల్ట్స్ రాబట్టింది. బ్యాటుతోనూ మెరిసిన అశ్విన్, 183 పరుగులు చేసి అదరగొట్టాడు...

బౌలింగ్‌లో 7.14 ఎకానమీతో 11 వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, కీలక సమయాల్లో భాగస్వామ్యాలను విడదీయడంలో సూపర్ సక్సెస్ సాధించాడు..

‘రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండ్ సత్తాపై నమ్మకం ఉంచి, అతన్ని అద్భుతంగా వాడినందుకు రాజస్థాన్ రాయల్స్‌కి క్రెడిట్ ఇవ్వాల్సిందే... ఎందుకంటే అశ్విన్‌ని ఆర్ఆర్ వాడినట్టు ఏ ఫ్రాంఛైజీ వాడలేకపోయింది...
 

రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్ కూడా చేయగలడని అందరికీ తెలుసు. అయితే అతన్ని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు పంపి, రాజస్థాన్ సక్సెస్ సాధించింది.. 

బాల్‌తోనూ కాదు, బ్యాటుతోనూ మ్యాచులను గెలిపించగలనని రవి అశ్విన్ నిరూపించుకున్నాడు. అశ్విన్‌ని రాజస్థాన్ పూర్తిగా నమ్మితే, ఫ్రాంఛైజీ పెట్టుకున్న నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు...
 

మహారాష్ట్ర పిచ్‌లతో పోలిస్తే కోల్‌కత్తా ఈడెన్ గార్డెన్ పిచ్ భిన్నంగా ఉంటుంది. ఆ పిచ్‌పై జోస్ బట్లర్ ఎలా ఆడతాడో చూడాలి. అతను పిచ్‌ను అర్థం చేసుకోగలిగితే... భారీ స్కోరు చేయడం పెద్ద కష్టమేమీ కాదు...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్... 

click me!