తగ్గేదేలే! వచ్చే సీజన్‌లో వచ్చేస్తున్నా... యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్...

Published : Mar 29, 2022, 08:44 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో క్రికెట్ ఫ్యాన్స్ ఏకంగా ముగ్గురు లెజెండ్స్‌ని మిస్ అవుతున్నారు. ‘మిస్టర్ 360’ ఏబీ డివిల్లియర్స్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటే... ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనాను మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు... ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్ కూడా ఐపీఎల్‌ వేలంలో పాల్గొనలేదు..

PREV
17
తగ్గేదేలే! వచ్చే సీజన్‌లో వచ్చేస్తున్నా... యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్...

ఐపీఎల్‌లో ఆరు సెంచరీలు, అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక సిక్సర్లు వంటి రికార్డులెన్నో క్రియేట్ చేసిన ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్.. ఈసారి మెగా వేలానికి రిజిస్టర్ చేయించుకోలేదు...

27

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత క్రిస్ గేల్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరిగింది. ఐపీఎల్ వేలానికి రిజిస్టర్ చేయించుకోకపోవడంతో ఆ వార్తలు నిజమేనని అనుకున్నారంతా...

37

తాజాగా ఆ రూమర్లకు ఓ ఇన్‌స్టా పోస్టుతో చెక్ పెట్టేశాడు క్రిస్ గేల్. ‘వర్క్ జస్ట్ స్టార్ట్... లెట్స్ గో... వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం ప్రిపరేషన్స్ మొదలెట్టేశా...’ అంటూ వర్కవుట్స్ చేస్తున్న ఫోటో పోస్ట్ చేశాడు గేల్...

47

ఐపీఎల్‌ 2013 సీజన్‌లో పూణే వారియర్స్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచి, అత్యధిక స్కోరు నమోదు చేశాడు క్రిస్ గేల్...

57

ఐపీఎల్‌లో 142 మ్యాచులు ఆడిన క్రిస్ గేల్, మొదటి సీజన్ తప్ప మిగిలిన సీజన్లన్నీ ఆడాడు. కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన గేల్, గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున ఆడాడు...

67

ఐపీఎల్ 2021 సీజన్‌లో 10 మ్యాచులు ఆడిన క్రిస్ గేల్, 21.44 సగటుతో 193 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 46 పరుగులు మాత్రమే... 

77

ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 142 మ్యాచులు ఆడిన క్రిస్ గేల్, 4965 పరుగులు చేశాడు. 6 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు చేసిన క్రిస్ గేల్, 405 ఫోర్లు, 357 సిక్సర్లు బాదాడు..

click me!

Recommended Stories