రంగంలోకి నీతా అంబానీ.. ముంబై ఇండియన్స్ కు ఫోన్.. వరుస ఓటములపై ఏం చెప్పారంటే..

Published : Apr 11, 2022, 12:59 PM IST

Nita Ambani Calls Mumbai Indians: ఐపీఎల్ లో 5 సార్లు ఛాంపియన్లు ముంబై ఇండియన్స్ ఈసారి మాత్రం వరుస ఓటములతో  చతికిలపడుతున్నారు. ఈ సీజన్ లో ఆ జట్టు ఇంకా విజయ బోణీ చేయలేదు. దీంతో  ముంబై ఇండియన్స్ ఓనర్ నీతా అంబానీ రంగంలోకి దిగారు. 

PREV
19
రంగంలోకి నీతా అంబానీ.. ముంబై ఇండియన్స్ కు ఫోన్.. వరుస ఓటములపై ఏం చెప్పారంటే..

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ లో ఏదీ కలిసిరావడం లేదు. సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ నుంచి ఇటీవలే ముగిసిన నాలుగో మ్యాచ్ దాకా అన్నీ పరాజయాలే. పాయింట్ల పట్టికలో ఆ జట్టు 9వ స్థానంలో ఉంది. 

29

జట్టు సెలెక్షన్, ఆటగాళ్ల ఆటతీరుపై  కెప్టెన్ రోహిత్ శర్మ బహిరంగంగానే  అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వేళ.. జట్టు యజమాని నీతా అంబానీయే స్వయంగా రంగంలోకి దిగారు. 

39

ఈనెల 13న ముంబై ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్ తో కీలక మ్యాచ్ ఆడనున్నది. ఈ నేపథ్యంలో నీతా అంబానీ జట్టు సభ్యులతో  ఫోన్ లో మాట్లాడారు. ఆటగాళ్లకు ప్రత్యేక సందేశం పంపారు. 

49

నీతా మాట్లాడుతూ... ‘నాకు మీ మీద పూర్తి నమ్మకముంది. ఈ ఓటములనేవి మనం ఇప్పుడే కొత్తగా చూస్తున్నవి కాదు. గతంలో కూడా వచ్చినవే. కానీ మనం పోరాడి ఎదురు నిలిచాం. 

59

ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ఉండండి. ఈ ఎత్తుపల్లాలు అనేది ఆటలో సర్వ సాధారణం. మనమీద మనం నమ్మకముంచాలి. అప్పుడే మనం విజయం సాధించగలుగుతాం. ఈ ప్రయాణంలో నా పూర్తి మద్దతు మీకు ఉంటుంది..

69

మీకేం కావాలన్న అడగండి. అన్నీ సమకూరుస్తాం.  కానీ మీమీద మీరు నమ్మకముంచండి.  ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని కోల్పోవద్దు.  ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ  మొత్తం మీకు మద్దతుగా నిలుస్తుంది...’ అని తెలిపారు. 

79

మరి నీతా అంబానీ మాటలు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో ఏ మేరకు స్ఫూర్తి నింపుతాయనేది ఏప్రిల్ 13న తేలిపోనుంది.  ఆ రోజు పంజాబ్ తో మ్యాచ్ ఓడితే మాత్రం  ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ లో  ప్లే ఆఫ్ అవకాశాలు మూసుకుపోయినట్టే లెక్క. 

89

అయితే ముంబై జట్టు వరుసగా నాలుగు మ్యాచులు ఓడటం ఇదే తొలిసారి కాదు. 2008, 2014, 2015లో కూడా ఇలాగే జరిగింది. కానీ 2014లో ఆ జట్టు వరుసగా నాలుగు మ్యాచులు ఓడినా తిరిగి పుంజుకుని   ఏకంగా  ట్రోఫీ నెగ్గింది. 

99

ఇక 2014లో వరుసగా ఐదు మ్యాచులు ఓడిన ముంబై ఇండియన్స్.. పంజాబ్ కింగ్స్ తో వాంఖెడే వేదికగా జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయంతో తిరిగి విజయాల బాట పట్టింది. మరి ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని ముంబై అభిమానులు భావిస్తున్నారు. 

click me!

Recommended Stories