సన్‌రైజర్స్‌కి ఊహించని షాక్... ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి కేన్ విలియంసన్, కారణం ఇదే...

First Published May 18, 2022, 11:38 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై ఉత్కంఠ విజయాన్ని అందుకుని, ప్లేఆఫ్స అవకాశాలను సజీవంగా నిలుపుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ కేన్ విలియంసన్, సీజన్ మధ్యలోనే జట్టును వదిలి వెళ్లాడు...

ఐపీఎల్ 2022 సీజన్ మొదటి 12 మ్యాచుల్లో ఓపెనర్‌గా వచ్చిన కేన్ విలియంసన్, వేగంగా పరుగులు చేయలేక తెగ ఇబ్బందిపడ్డాడు. ఈ కారణంగానే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేన్ విలియంసన్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు...

13 మ్యాచుల్లో 19.64 సగటుతో 216 పరుగులు చేసిన కేన్ విలియంసన్, 93.51 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేసి ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు... అయితే ఆఖరి లీగ్ మ్యాచ్‌కి కేన్ విలియంసన్ అందుబాటులో ఉండడం లేదు...

కేన్ విలియంసన్ సతీమణి సారా రహీం రెండో బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కేన్ విలియంసన్, ఐపీఎల్ బయో బబుల్‌ని వీడి, న్యూజిలాండ్‌కి బయలుదేరి వెళ్లాడు... ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో కేన్ విలియంసన్ అందుబాటులో ఉండడం లేదు...

డిసెంబర్ 2020న కేన్ విలియంసన్, సారా రహీం దంపతులకు తొలి సంతానంగా ఓ అమ్మాయి జన్మించింది. ఆ సమయంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ నుంచి తప్పుకుని, ఇంటికి వెళ్లాడు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్..

కేన్ విలియంసన్ జట్టుకి దూరం కావడంతో ఆఖరి లీగ్ మ్యాచ్‌కి భువనేశ్వర్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2021 సీజన్‌లోనూ కేన్ విలియంసన్ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆడలేదు. విలియంసన్ గాయం కారణంగా తప్పుకోవడంతో మనీశ్ పాండే కెప్టెన్‌గా వ్యవహరించాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్ చేరాలంటే పంజాబ్ కింగ్స్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది ఎస్‌ఆర్‌హెచ్. అయినా మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడి ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ నిర్ణయించబడుతుంది...

click me!