టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్... రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్‌లను ఫాలో అవుతూ...

First Published May 18, 2022, 11:13 AM IST

భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్, హైదరాబాదీ వెరీ వెరీ స్పెషల్ వీవీఎస్ లక్ష్మణ్... త్వరలో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. అవును... వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అయితే పూర్తి స్థాయి కోచ్‌గా మాత్రం కాదులెండి... తాత్కాలిక కోచ్‌గానే...

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో కలిసి ఐదు టీ20 మ్యాచుల సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ సిరీస్‌కి భారత స్టార్ ప్లేయర్లు అందరూ దూరం కానున్నారు...

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ, ప్రస్తుత సారథి రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి స్టార్ ప్లేయర్లందరికీ ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది...

స్టార్ ప్లేయర్లు దూరం కావడంతో ఈ సిరీస్‌కి శిఖర్ ధావన్ లేదా హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. లంక టూర్‌లో టీమిండియాకి కెప్టెన్‌గా వ్యవహరించిన గబ్బర్‌కే కెప్టెన్సీ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి...

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మోహ్సీన్ ఖాన్ వంటి యంగ్ ప్లేయర్లకు సౌతాఫ్రికా సిరీస్‌లో అవకాశం కల్పించాలని సెలక్టర్లు యోచిస్తున్నారు...

ఈ సిరీస్‌కి రాహుల్ ద్రావిడ్‌కి బదులుగా ఎన్‌సీఏ హెడ్‌ వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం...

Rahul Dravid

జూలై 1న ఇంగ్లాండ్‌లో జరిగే నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం జూన్ నెల మధ్యలోనే లండన్‌కి బయలుదేరనుంది భారత టెస్టు టీమ్. ఈ టీమ్‌తో పాటు భారత ప్రధాన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఇంగ్లాండ్‌ వెళ్లనున్నారు...

VVS Laxman

కాబట్టి స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆడే టీ20 సిరీస్‌తో పాటు ఐర్లాండ్‌తో ఆడే రెండు వన్డేల సిరీస్‌కి కూడా వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నారు...

గత ఏడాది ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్లిన భారత ప్రధాన జట్టుకి అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రి కోచ్‌గా వ్యవహరిస్తే... అదే టైమ్‌లో లంక టూర్‌కి వెళ్లిన జట్టుకి రాహుల్ ద్రావిడ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఇదే ఫార్ములాని అనుసరించనుంది టీమిండియా...

click me!