అచ్చిరాని జెర్సీలో ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీలో బెంగళూరు! గత రికార్డులు చూసి..

Published : May 07, 2022, 04:15 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ ప్రీ క్లైమాక్స్‌కి చేరుకుంది. ఇప్పటికే 50కి పైగా మ్యాచులు ముగియడంతో ప్లేఆఫ్స్ బెర్త్ కోసం 8 జట్ల మధ్య రసవత్తరమైన పోటీ మొదలైంది. ఇకపై జరిగే ప్రతీ మ్యాచ్‌, ప్లేఆఫ్స్ బెర్త్ కోసం జరిగే పోరాటమే...

PREV
18
అచ్చిరాని జెర్సీలో ఆర్‌సీబీ.. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీలో బెంగళూరు! గత రికార్డులు చూసి..

గుజరాత్ టైటాన్స్ ఇప్పటికే 8 మ్యాచులు గెలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించగా 8 మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్.. ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఇక మిగిలిన 3 ప్లేఆఫ్స్ బెర్తుల కోసం 8 జట్లు పోటీపడబోతున్నాయి...

28

10 మ్యాచుల్లో 7 మ్యాచులు ఓడినప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగానే ఉన్నాయి. అయితే సీఎస్‌కే మిగిలిన మ్యాచుల్లో భారీ తేడాతో విజయాలు అందుకోవడంతో పాటు మిగతా జట్లపై ఆధారపడాల్సి ఉంటుంది..

38

11 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంటే 10 మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది...

48
RCB Blue Jersey

ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌... ప్లేస్‌లను తారుమారు చేసే అవకాశం ఉంది. ప్రతీ యేటా ఓ సామాజిక సంక్షేమ కార్యక్రమం కోసం స్పెషల్ జెర్సీలో మ్యాచ్ ఆడడం ఆర్‌సీబీకి అలవాటు.గత ఏడాది కరోనా యుద్ధంలో అహర్నిషలు పాటుపడిన హెల్త్ కేర్ వర్కర్స్‌కి సపోర్ట్‌గా బ్లూ జెర్సీలో మ్యాచ్ ఆడింది ఆర్‌సీబీ...

58

ఈసారి పచ్చదనం, చెట్ల పెంపకంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ‘గో గ్రీన్’ నినాదంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో గ్రీన్ జెర్సీలో కనిపించబోతున్నారు ఆర్‌సీబీ ప్లేయర్లు...

68

అయితే ఆర్‌సీబీకి గ్రీన్ జెర్సీ పెద్దగా కలిసి రాలేదు, ఆ మాటకి వస్తే ఇప్పటిదాకా ఏ జెర్సీ కలిసి రాలేదు. అయితే గ్రీన్ జెర్సీలో తొలిసారి 2011లో మ్యాచ్ ఆడిన ఆర్‌సీబీ, ఆ సీజన్‌లో విజయం సాధించింది. మళ్లీ 2016 సీజన్‌లో గ్రీన్ జెర్సీలో ఆడిన మ్యాచ్‌లో గెలిచింది...

78

మిగిలిన సీజన్లలో గ్రీన్ జెర్సీలో మ్యాచ్ ఆడిన ప్రతీసారి ఓటమి పాలైంది ఆర్‌సీబీ. 2015లో గ్రీన్ జెర్సీలో బరిలో దిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా 2012, 2013, 2014, 2017, 2018, 2019, 2020 సీజన్లలో ఓడింది. 2021లో బ్లూ జెర్సీలో బరిలో దిగిన మ్యాచ్‌లోనూ పరాజయమే ఎదురైంది.

88

దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ కంగారు పడుతుంటే, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్లు ఖుషీ అవుతున్నారు. ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా రెండు ఓటముల తర్వాత ఐదు విజయాలు అందుకున్న సన్‌రైజర్స్, ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు అందుకుంది. ఆర్‌సీబీతో మ్యాచ్‌, ఆరెంజ్ ఆర్మీకి కీలకంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories