డౌటే లేదు! జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ రికార్డును కొట్టేస్తాడు, కాకపోతే... హర్భజన్ సింగ్ కామెంట్స్...

Published : May 07, 2022, 03:28 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్. ఇప్పటికే 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 588 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో దూసుకుపోతున్నాడు...

PREV
19
డౌటే లేదు! జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ రికార్డును కొట్టేస్తాడు, కాకపోతే... హర్భజన్ సింగ్ కామెంట్స్...

జోస్ బట్లర్ బీభత్సమైన ఫామ్‌ చూసి, విరాట్ కోహ్లీ 2016లో సృష్టించిన 973 పరుగుల రికార్డును ఎక్కడ కొట్టేస్తాడేమోనని భయపడుతున్నారు ఆయన అభిమానులు...

29

ఐపీఎల్ 2016 సీజన్‌లో ఆర్‌సీబీని ఒంటిచేత్తో ఫైనల్ చేర్చిన విరాట్ కోహ్లీ 16 మ్యాచుల్లో 81.08 యావరేజ్‌తో 152 స్ట్రైయిక్ రేటుతో 973 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి... ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం.

39

ప్రస్తుత సీజన్‌లో 10 మ్యాచుల్లో 65.33 సగటుతో 588 పరుగులు చేశాడు జోస్ బట్లర్. ఇందులో 3 సెంచరీలు,3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి...
 

49

విరాట్ కోహ్లీ రికార్డును కొట్టాలంటే గ్రూప్ స్టేజీలో మిగిలిన 4 మ్యాచులతో పాటు ప్లేఆఫ్స్‌లోనూ అదరగొట్టే పర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది బట్లర్... 

59

తాజాగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రం జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ కొట్టేస్తాడని అంటున్నాడు. ‘జోస్ బట్లర్‌‌కి విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసే సత్తా కచ్ఛితంగా ఉంది...

69

ఇప్పుడు అతను ఉన్న ఫామ్ చూస్తుంటే, అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదనే అనిపిస్తోంది. అదీకాకుండా పిచ్‌లు బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్నాయి. పిచ్‌లు ఇలాగే ఉంటే బట్లర్‌కి విరాట్ రికార్డు బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు...

79

ఒకవేళ పిచ్‌లు స్పిన్‌కి అనుకూలించడం మొదలుపెడితే బట్లర్ ఎలా ఆడతాడో చూడాలి. అయితే జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేయాలంటే రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరాల్సిందే...

89

రాజస్థాన్ రాయల్స్ 17 మ్యాచులు ఆడితే మాత్రం విరాట్ కోహ్లీ రికార్డును దాటేసి, 1000 పరుగులతో కొత్త మైలురాయి సెట్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు...’ అంటూ కామెంట్ చేశాడు హర్భజన్ సింగ్...
 

99

10 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, మిగిలిన నాలుగు మ్యాచుల్లో రెండింట్లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది..

Read more Photos on
click me!

Recommended Stories