నువ్వో పెద్ద బ్రాడ్‌మెన్ మరి... జడ్డూపై రివెంజ్ తీర్చుకున్న హర్షల్ పటేల్...

Published : May 05, 2022, 11:35 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నాలుగోసారి టైటిల్ గెలిచింది. ఆ సీజన్‌లో సీఎస్‌కే షో మొత్తం ముఖ్యంగా ఓ ఐదుగురి చుట్టే తిరిగింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్, బౌలర్లు దీపక్ చాహార్, శార్దూల్ ఠాకూర్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా...

PREV
110
నువ్వో పెద్ద బ్రాడ్‌మెన్ మరి... జడ్డూపై రివెంజ్ తీర్చుకున్న హర్షల్ పటేల్...

గత సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన రవీంద్ర జడేజా, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో విశ్వరూపమే చూపించాడు. పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది ఏకంగా 37 పరుగులు రాబట్టాడు జడ్డూ...

210
Ravindra Jadeja

ఆ మ్యాచ్‌లో 3 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు తీసి 14 పరుగులు మాత్రమే ఇచ్చాడు హర్షల్ పటేల్. అయితే ఆఖరి ఓవర్‌లో మొదటి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు, అందులో ఒకటి నో బాల్ కావడంతో ఫ్రీ హిట్‌కి మరో సిక్సర్ బాదాడు రవీంద్ర జడేజా...

310

నాలుగో బంతికి 2 పరుగులు రాగా ఐదో బంతికి ఇంకో సిక్సర్, ఆరో బంతికి ఫోర్ బాదడంతో ఏకంగా రికార్డు స్థాయిలో 37 పరుగులు వచ్చేశాయి. జడ్డూ చెలరేగిపోవడంతో ఆఖరి ఓవర్‌ ముగిసే సమయానికి 51 పరుగులు సమర్పించుకున్నాడు హర్షల్ పటేల్...

410

19 ఓవర్లు ముగిసే సమయానికి 154 పరుగులే చేసిన సీఎస్‌కే, 191 భారీ స్కోరు చేసి ముగించగలిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 122 పరుగులకే పరిమితమై 69 పరుగుల తేడాతో పరాజయం పాలైంది..

510

బ్యాటింగ్‌లో 28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచిన రవీంద్ర జడేజా... బౌలింగ్‌లో 13 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ ఓవర్ కూడా ఉంది...

610

అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ఓ రనౌట్ చేసిన రవీంద్ర జడేజా... ఆల్‌రౌండ్ షోతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు. ఈ ఇన్నింగ్స్‌కి ఎట్టకేలకు ప్రతీకారం తీర్చుకున్నాడు హర్షల్ పటేల్...

710

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 13 పరాజయం పాలై, ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ మ్యాచ్‌లో జడ్డూ  బౌలింగ్‌లో 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి పొదుపుగా బౌలింగ్ చేసినా బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు...

810

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న జడ్డూ 5 బంతులాడి 3 పరుగులు మాత్రమే చేసి హర్షల్ పటేల్ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 2021లో తన బౌలింగ్‌లో చెలరేగిపోయిన జడ్డూపై ప్రతీకారం తీర్చుకున్నట్టైంది హర్షల్ పటేల్...

910

11 మ్యాచుల్లో ఆరు విజయాలు అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. మిగిలిన మూడు మ్యాచుల్లో రెండింట్లో గెలిస్తే, నేరుగా ఫ్లేఆఫ్స్ చేరుతుంది ఆర్‌సీబీ...

1010

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటిదాకా 10 మ్యాచుల్లో 3 విజయాలే అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. అయితే మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఘన విజయాలు అందుకుంటే మెరుగైన రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ రేసులో నిలిచే అవకాశం ఉంటుంది...

click me!

Recommended Stories