అతన్ని చూస్తుంటే విరాట్ కోహ్లీ గుర్తుకువస్తున్నాడు... శుబ్‌మన్ గిల్‌పై రవిశాస్త్రి కామెంట్స్...

Published : Apr 10, 2022, 06:08 PM IST

ఐపీఎల్ 2020 పర్ఫామెన్స్ కారణంగా భారత టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు శుబ్‌మన్ గిల్. గత సీజన్ ఆరంభంలోనూ ఐపీఎల్‌లో టెస్టు ఇన్నింగ్స్‌లతో విసిగించిన శుబ్‌మన్ గిల్, ఈసారి మాత్రం వేరే లెవెల్ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు... 

PREV
110
అతన్ని చూస్తుంటే విరాట్ కోహ్లీ గుర్తుకువస్తున్నాడు... శుబ్‌మన్ గిల్‌పై రవిశాస్త్రి కామెంట్స్...
Shubman Gill

టెస్టు ప్లేయర్ లాంటి శుబ్‌మన్ గిల్‌ని గుజరాత్ టైటాన్స్ జట్టు ఏకంగా రూ.8 కోట్లు పెట్టి డ్రాఫ్ట్‌గా కొనుగోలు చేయడంపై క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ నోరెళ్లబెట్టారు. అయితే గిల్ మాత్రం తన ధరకు న్యాయం చేస్తున్నాడు. 

210

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 46 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, ఐపీఎల్ కెరీర్‌లో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు...

310

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 59 బంతుల్లో 11 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 96 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, తన స్కోరును మరింత మెరుగుపర్చుకున్నాడు. 4 పరుగుల తేడాతో మెయిడిన్ సెంచరీ చేసే ఛాన్స్ కోల్పోయాడు...

410

‘శుబ్‌మన్ గిల్ చాలా చక్కగా ఆడాడు, గత మ్యాచ్‌లో కంటే చాలా చాలా చక్కగా ఆడాడు. అతను బ్యాక్ ఫుట్‌తో ఆడిన కొన్ని షాట్స్, ప్లేస్‌మెంట్, పవర్ వాడిన విధానం అద్భుతం...

510

అతను ఆడిన షాట్స్, శుబ్‌మన్ గిల్‌ని స్టాండ్‌ అవుట్ ప్లేయర్‌గా నిలబెడుతున్నాయి. ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో యంగ్ బెస్ట్ ప్లేయర్లలో శుబ్‌మన్ గిల్ ఒకడు...

610

శుబ్‌మన్ గిల్ ఫుల్ ఫ్లోలో ఉంటే అతని ఆట చూడడానికి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే అవుతుంది. అతను ఇప్పుడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. గత రెండు మ్యాచుల్లోనూ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు...

710

ఓపెనర్‌ ఫామ్‌లో ఉంటే, పరుగుల ప్రవాహాన్ని కట్టడి చేయడం కష్టమైపోతుంది. ఓపెనర్లు పరుగుల వరద పారిస్తుంటే, ఆ జట్టు పాయింట్ల పట్టికలో పైపైకి వెళుతూ ఉంటుంది...

810

గుజరాత్ టైటాన్స్‌కి ఇప్పుడు శుబ్‌మన్ గిల్ ఓ ఆశాకిరణం. అతను ఈ ఫామ్‌ని కొనసాగించినంత కాలం ఆ జట్టుకి తిరుగే ఉండదు. గిల్ ఇన్నింగ్స్‌ని బాగా గమనిస్తే, అతను చాలా తక్కువ డాట్ బాల్స్ ఆడతాడు.

910

బౌండరీలు రాకపోతే స్ట్రైయిక్ రొటేట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తాడు. అందుకే శుబ్‌మన్ గిల్‌ని చూస్తుంటే నాకు విరాట్ కోహ్లీ గుర్తుకువస్తాడు...

1010

ఇప్పుడున్న ఫామ్‌ని కొనసాగిస్తే ఈసారి అతను కచ్చితంగా 600 నుంచి 700 పరుగులు చేయగలడు. గిల్ హైయిట్‌కి,  షాట్ సెలక్షన్‌కి ఈ సీజన్‌లో 600 పరుగులు చేయలేకపోతే, అతని ఫామ్ వేస్ట్ అవుతుంది... ’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

Read more Photos on
click me!

Recommended Stories