రోహిత్ కెప్టెన్సీదేం లేదు! వాళ్ల వల్లే ముంబై ఇండియన్స్‌కి ఇన్ని టైటిల్స్... వరుస పరాజయాలతో...

Published : Apr 10, 2022, 04:02 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. 2013లో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్‌కి 8 సీజన్లలో 5 టైటిల్స్ అందించాడు. రోహిత్ కెప్టెన్సీలో ప్లేఆఫ్స్ చేరిన ప్రతసారీ ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచింది...

PREV
111
రోహిత్ కెప్టెన్సీదేం లేదు! వాళ్ల వల్లే ముంబై ఇండియన్స్‌కి ఇన్ని టైటిల్స్... వరుస పరాజయాలతో...
Rohit Sharma

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించి, ఐదోసారి టైటిల్ గెలిచింది ముంబై ఇండియన్స్. దీంతో రోహిత్ శర్మకు టీమిండియా కెప్టెన్సీ ఇవ్వాలనే వాదన విపరీతంగా పెరిగింది...

211

ఆర్‌సీబీ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ 9 సీజన్లలో ఒక్క టైటిల్ కూడా గెలవకపోవడం, అదే టైంలో రోహిత్ శర్మ ఐదు టైటిల్స్ గెలవడంతో ఐపీఎల్ ఫ్యాన్స్‌లో చాలామంది ముంబై సారథికి టీమిండియా కెప్టెన్సీ ఇవ్వాలని డిమాండ్ చేశారు..

311

అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలను అందుకుంటోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంలో పడేసుకుంది...

411
Rohit Sharma

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇషాన్ కిషన్, జోఫ్రా ఆర్చర్‌లను కొనుగోలు చేయడానికే ఎక్కువ మొత్తం ఖర్చు చేసిన ముంబై ఇండియన్స్ టీమ్, వచ్చే ఏడాది కోసమే ఎక్కువగా ప్రిపేర్ అవుతున్నట్టు కనిపించింది...

511

కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ముంబై ఇండియన్స్‌ని విజయాల బాట పట్టించకపోవడంతో యాంటీ ఫ్యాన్స్‌కి ఓ గట్టి పాయింట్ దొరికినట్టైంది. 

611

హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహార్, క్వింటన్ డి కాక్, ట్రెంట్ బౌల్ట్, జయంత్ యాదవ్ వంటి ప్లేయర్లు... ఐపీఎల్ గెలిచిన ముంబై టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు...

711
Quinton de Kock

వీరిని వేలానికి వదిలేసిన ముంబై ఇండియన్స్, తిరిగి కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇదే ఇప్పుడు ఆ టీమ్ పర్ఫామెన్స్‌ని దారుణంగా దెబ్బ తీసిందని అంటున్నారు నెటిజన్లు...

811
chris lynn

క్రిస్ లీన్, సౌరబ్ తివారి, ఆదిత్య తారే, మిచెల్ మెక్‌లాగన్, నాథన్ కౌంటర్‌నైల్, జేమ్స్ పాటిన్సన్ వంటి స్టార్లను రిజర్వు బెంచ్‌ కూర్చోబెట్టిన ముంబై ఇండియన్స్, ఇప్పుడు ఒక్క విజయం కోసం జట్టులో మార్పులు, చేర్పులు చేస్తోంది...

911

మరోవైపు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో నాలుగు టైటిల్స్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కూడా ఐపీఎల్ 2022 సీజన్‌లో ఒక్క విజయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది...

1011

కెప్టెన్సీ మారినా, క్రీజులో కెప్టెన్సీ చేసేది ఎమ్మెస్ ధోనీయే. అయినా చెన్నైకి విజయాలు రాకపోవడానికి ఫాఫ్ డుప్లిసిస్, సురేష్ రైనా, శార్దూల్ ఠాకూర్, సామ్ కుర్రాన్ వంటి స్టార్లు జట్టులో లేకపోవడమే అంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

1111

ఒకే ఒక్క బ్యాడ్ సీజన్ కారణంగా డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ కోల్పోయి జట్టుకి దూరమైనట్టు... వరుసగా నాలుగు పరాజయాలను ఎదుర్కోవడంతో ఐదు టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మ కెప్టెన్సీనే శంకిస్తున్నారు అభిమానులు... 

Read more Photos on
click me!

Recommended Stories