వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు కొట్టిన పృథ్వీషా... పవర్ ప్లేలోనే దంచి కొట్టిన ఢిల్లీ ఓపెనర్...

Published : Apr 10, 2022, 04:36 PM ISTUpdated : Apr 10, 2022, 04:44 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు బీసీసీఐ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యాడు పృథ్వీషా. ఆస్ట్రేలియాలో ఆడిలైడ్ టెస్టు తర్వాత భారత ప్రధాన జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీషా, ఆ తర్వాత దేశవాళీ టోర్నీల్లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చినా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించలేకపోయాడు...

PREV
19
వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు కొట్టిన పృథ్వీషా... పవర్ ప్లేలోనే దంచి కొట్టిన ఢిల్లీ ఓపెనర్...

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు ఎన్‌సీఏలో భారత కాంట్రాక్ట్ ప్లేయర్లకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించింది భారత క్రికెట్ బోర్డు. ఈ టెస్టులో పాస్ అయిన వారే, ఐపీఎల్‌లో ఆడాలంటే షరతు విధించింది...
 

29

హార్ధిక్ పాండ్యా సెంట్ పర్సెంట్ పాయింట్లతో ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేయగా, పృథ్వీషా మాత్రం యో యో టెస్టులో ఫెయిల్ అయ్యాడు. అయితే పృథ్వీషాని టీమిండియాకి పరిగణనలోకి తీసుకోకపోవడంతో అతన్ని ఐపీఎల్ ఆడేందుకు అనుమతించింది...

39

ఐపీఎల్ 2022 సీజన్‌లో పర్ఫామెన్స్‌ బట్టే పృథ్వీషా భవితవ్యం ఆధారపడి ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన పృథ్వీషా, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 10 పరుగులకే అవుట్ అయ్యాడు.

49

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేసిన పృథ్వీ షా, కేకేఆర్‌తో మ్యాచ్‌లో 29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు...

59

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున పవర్ ప్లేలో 1000+ పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు పృథ్వీషా. ఇంతకుముందు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఈ ఫీట్ సాధించాడు...

69

వీరేంద్ర సెహ్వాగ్ ఐపీఎల్ కెరీర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున పవర్ ప్లేలో 1250 పరుగులు చేయగా పృథ్వీ షా 1000+ పరుగులతో ఉన్నాడు. శిఖర్ ధావన్ 935 పరుగులు చేశాడు.

79

పంజాబ్ కింగ్స్ తరుపున కెఎల్ రాహుల్, రాజస్థాన్ రాయల్స్ తరుపున అజింకా రహానే ఈ ఫీట్ సాధించగా కేకేఆర్ తరుపున గౌతమ్ గంభీర్, రాబిన్ ఊతప్ప పవర్ ప్లేలో 1000+ పరుగులు చేశారు...

89

చెన్నై సూపర్ కింగ్స్‌ తరుపున సురేష్ రైనా, ఫాఫ్ డుప్లిసిస్, మురళీ విజయ్ ఈ ఫీట్ సాధించగా ముంబై ఇండియన్స్ తరుపున రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్... ఆర్‌సీబీ తరుపున క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించారు...

99

సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ పవర్ ప్లేలో 1000+ పరుగులు చేసిన ప్లేయర్లుగా ఉన్నారు. డేవిడ్ వార్నర్ ప్రస్తుత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న విషయం తెలిసిందే...

click me!

Recommended Stories