కపిల్ దేవ్, అజార్, ఎమ్మెస్ ధోనీ... బయోపిక్ ఎవ్వరిదైనా సచిన్ టెండూల్కర్ ఉండాల్సిందే...

First Published Nov 30, 2021, 12:51 PM IST

భారత్‌లో క్రికెట్ కేవలం ఓ ఆట మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది ఎమోషన్. భారత జట్టు మ్యాచ్ ఓడిపోతే భావోద్వేగంతో ఏడ్చేసేవాళ్లు, గెలిస్తే విజయగర్వంతో ఆ సక్సెస్‌ని తమ సక్సెస్‌గా సంబరాలు చేసుకునేవాళ్లు కొన్ని కోట్ల మంది ఉంటారిక్కడ....

సినిమా హీరోలను దేవుళ్లుగా కొలిచే దేశంలో క్రికెటర్లను కూడా దేవుళ్లుగా అభిమానించేవాళ్లు లేకపోలేదు. క్రికెట్ ఓ మతం అయితే, దానికి దేవుడు మాత్రం మాజీ క్రికెటర్, ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్...

తాజాగా టీమిండియాకి మొట్టమొదటి వరల్డ్ కప్ 1983 అందించిన కెప్టెన్ కపిల్ దేవ్, జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘83’ ట్రైలర్ విడుదలైంది...

మిగిలిన అన్ని బయోపిక్స్‌లా ఓ క్రికెటర్ ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, అతని జీవితంలో ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని అతను ఎలా ఎదుర్కొన్నడనే పాలసీని ఎంచుకోలేదు డైరెక్టర్ కబీర్ ఖాన్... 

1983 వరల్డ్ కప్‌లో అండర్‌గాడ్స్‌గా బరిలో దిగి, భారత జట్టు విశ్వవిజేతగా ఎలా అయ్యింది. అప్పటిదాకా క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న వెస్టిండీస్‌ను ఎలా మట్టికరిపించిందనే అంశాలే ఇతివృత్థంగా ‘83’ మూవీ తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.. 

కపిల్‌దేవ్, భారత జట్టుకి వన్డే వరల్డ్ కప్ 1983 అందించిన సమయానికి సచిన్ టెండూల్కర్ వయసు కేవలం 10 ఏళ్లు. అయినా ‘83’ మూవీలో సచిన్ టెండూల్కర్ రిఫరెన్స్ చూపించారు...

1983 వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత 10 ఏళ్ల బాలుడు సచిన్ టెండూల్కర్, తండ్రితో కలిసి సంబరాలు చేసుకుంటున్నట్టుగా ట్రైలర్‌లోనే చూపించారు...


కేవలం కపిల్‌దేవ్ బయోపిక్ మాత్రమే కాదు, ఇంతకుముందు వచ్చిన మాజీ క్రికెటర్లు అజారుద్దీన్, ఎమ్మెస్ ధోనీ బయోపిక్‌లలోనూ సచిన్ టెండూల్కర్ ప్రస్తావన ఉంది...

భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్, సచిన్ టెండూల్కర్ గురించి, టీనేజ్ వయసులోనే అతనికి ఉన్న క్రేజ్ గురించి చెబుతాడు. ఓ షాట్‌లో సచిన్ టెండూల్కర్ పాత్ర కూడా కనిపిస్తుంది...

అలాగే ఎమ్మెస్ ధోనీ బయోపిక్‌లో సచిన్ టెండూల్కర్‌ను దేవుడిగా ఆరాధిస్తాడు మాహీ. 2011 వన్డే వరల్డ్‌కప్ విజయం తర్వాత ధోనీని సచిన్ టెండూల్కర్ హత్తుకున్న దృశ్యాలు కూడా కనిపిస్తాయి...

వీరితో పాటు త్వరలో తెరకెక్కబోయే సౌరవ్ గంగూలీ బయోపిక్‌లోనూ సచిన్ టెండూల్కర్ ప్రస్తావన తప్పనిసరి. గంగూలీకి ముందు జట్టును నడిపించిన సారథి సచిన్ టెండూల్కర్...

అలాగే సౌరవ్ గంగూలీతో కలిసి ఓపెనింగ్ చేసి, ఎన్నో మ్యాచుల్లో భారత జట్టుకి అద్భుత విజయాలు అందించాడు సచిన్ టెండూల్కర్. కాబట్టి ‘దాదా’ బయోపిక్‌లో సచిన్ పాత్ర ఉండడం తప్పనిసరి...

సచిన్ టెండూల్కర్‌ ఎంట్రీకి ఆరేళ్ల ముందు జరిగిన ‘83’ నుంచి, ‘మాస్టర్’ రిటైర్మెంట్ దశలో క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి క్రికెటర్ల బయోపిక్‌లు తీసినా... ‘క్రికెట్ గాడ్’ ప్రస్తావన తప్పనిసరి అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు, ఫ్యాన్స్..

click me!