సరిగ్గా అదే టేబుల్... కాకపోతే రివర్స్‌లో! ఐపీఎల్ 2019 సీజన్‌ని ఫాలో అవుతున్న 2022...

Published : Apr 18, 2022, 06:53 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ కలిసి మొదటి 12 మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకుంటాయని ఏ క్రికెట్ అభిమాని కలలో కూడా ఊహించి ఉండడు. అయితే మెగా వేలం ఎఫెక్ట్‌తో ఐపీఎల్ 2022 సీజన్‌లో అది సాధ్యమైంది...

PREV
112
సరిగ్గా అదే టేబుల్... కాకపోతే రివర్స్‌లో! ఐపీఎల్ 2019 సీజన్‌ని ఫాలో అవుతున్న 2022...

ఐపీఎల్ 2022లో ఏ మాత్రం అంచనాలు లేకుండా సీజన్‌ను ప్రారంభించిన కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్నాయి...

212

ఐదు టైటిల్స్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఆరింట్లో ఒక్క విజయం కూడా అందుకోలేక ఆఖరి స్థానంలో నిలిస్తే... ఆరింట్లో ఒక్క విజయం అందుకున్న ఫోర్ టైం టైటిల్ విన్నర్ సీఎస్‌కే... కింద నుంచి రెండో స్థానంలో ఉంది...
 

312

అయితే ఐపీఎల్ 2022 సీజన్‌లో పాయింట్ల పట్టికను చూస్తే, ఐపీఎల్ 2019 సీజన్ గుర్తుకు వస్తోందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. మూడేళ్ల క్రితం సీజన్‌కి కరెక్టుగా రివర్స్‌లో ఈసారి జరుగుతుందని చెబుతున్నారు...

412

ఐపీఎల్ 2019 సీజన్‌లో లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి 14 మ్యాచుల్లో తొమ్మిదేసి విజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా 1,2,3 స్థానాల్లో నిలిచాయి...

512

ఇప్పుడు ఒక్క విజయం అందుకోలేక ముంబై, ఒకే విజయంతో చెన్నై, రెండు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్... కింద నుంచి 10, 9, 8 స్థానాల్లో ఉన్నాయి... 

612

సన్‌రైజర్స్ హైదరాబాద్ 2019 లీగ్ స్టేజీని 4వ స్థానంలో ముగిస్తే... 5 మ్యాచులు ముగిసే సమయానికి ఎస్‌ఆర్‌హెచ్ కింద నుంచి నాలుగో స్థానంలోనే నిలిచింది. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో గెలిచి పై నుంచి నాలుగో స్థానానికి దూసుకెళ్లింది ఆరెంజ్ ఆర్మీ..

712

కేకేఆర్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు కూడా 2019 సీజన్‌లో వరుసగా ఎలాగైనా 5, 6, 7, 8వ స్థానాల్లో ఉన్నాయో... ఈ సీజన్‌లో 3, 4, 5, 6 స్థానాల్లో నిలవడం విశేషం. 

812

 అప్పుడు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ ఆర్‌సీబీ వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచింది...

912

ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి, ఆఖరి స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది...

1012

2019 సీజన్‌ పాయింట్స్ టేబుల్‌కి రివర్స్, 2022 రిజల్ట్ వస్తున్నట్టే... ఐసీసీ వరల్డ్ కప్‌లోనూ రిజల్ట్ రివర్సులో రావాలని కోరుకుంటున్నారు టీమిండియా అభిమానులు...

1112

2019లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆర్‌సీబీ ఆఖరి స్థానంలో నిలిచిన తర్వాత ఆయన కెప్టెన్సీలోనే వన్డే వరల్డ్ కప్ ఆడిన భారత జట్టు... టేబుల్ టాపర్‌గా నిలిచినా సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది.

1212

ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడబోతోంది భారత జట్టు. ఈ సారి టీమిండియా టైటిల్ గెలవాలని, రోహిత్ శర్మ కెప్టెన్సీపై భారీ ఆశలు, అంచనాలే పెట్టుకున్నారు అభిమానులు. ఆ కల నెరవేరితే చాలని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్. 

click me!

Recommended Stories