సెహ్వాగ్‌కి బౌలింగ్ వేయాలంటే భయం! సచిన్ ఆ ఫుటేజ్ అడిగాడు.. సునీల్ నరైన్ కామెంట్స్...

Published : Apr 18, 2022, 05:52 PM IST

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య జరిగే మ్యాచ్ ద్వారా 150 మ్యాచులను పూర్తి చేసుకోబోతున్నాడు ఆల్‌రౌండర్ సునీల్ నరైన్. 2012 నుంచి కేకేఆర్‌లో సభ్యుడిగా ఉంటూ వస్తున్న సునీల్ నరైన్, కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

PREV
18
సెహ్వాగ్‌కి బౌలింగ్ వేయాలంటే భయం! సచిన్ ఆ ఫుటేజ్ అడిగాడు.. సునీల్ నరైన్ కామెంట్స్...
Sunil Narine

ఐపీఎల్ 2012, 2014 సీజన్లలో టైటిల్ గెలిచిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న సునీల్ నరైన్... బౌలింగ్‌లో  147 వికెట్లు తీయగా, బ్యాటింగ్‌లో 976 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి...

28

‘నేనెప్పుడూ వెంకీ మైసూర్‌తో చెబుతూ ఉంటాను, నాకు వేరే ఫ్రాంఛైజీలో ఆడడం ఇష్టం లేదని. నాకు కేకేఆర్‌లో ఉండడమే ఇష్టం.. ఇదే జట్టు నుంచి రిటైర్ అవ్వాలని అనుకుంటున్నా...
 

38

ఐపీఎల్‌లో ఒకే జట్టు తరుపున ఆడడం కూడా ఓ గొప్ప అఛీవ్‌మెంటే. ఫారిన్ ప్లేయర్లలో ఒకే జట్టుకి ఆడి రిటైర్ అయిన వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు... లక్కీగా నేను వారిలో ఒకడిని..

48

సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప క్రికెటర్‌, నా బౌలింగ్‌పై ఫోకస్ పెట్టారని తెలిసి చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. 2013 ఛాంపియన్స్ లీగ్ టీ20 సమయంలో టెండూల్కర్, నా బౌలింగ్ ఫుటేజీ అడిగారు..

58

రెండు వైపుల నుంచి బౌలింగ్ చేసే యాంగిల్స్ ఇవ్వమని కోరారు. అది ఆయన ఆఖరి ఐపీఎల్ సీజన్ కూడా. ఆయన డెడికేషన్ అలా ఉంటుంది. ఎప్పుడూ టాప్‌లో ఉండాలని కోరుకుంటారు...

68

ప్రతీ ప్లేయర్‌ గురించి స్పష్టంగా తెలుసుకోవాలని తపన ఆయనలో కనిపించింది. ఓ స్పిన్నర్‌గా నేనెప్పుడూ ఏ బ్యాటర్‌కి బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడలేదు...

78

అయితే వీరేంద్ర సెహ్వాగ్‌కి బౌలింగ్ చేయడానికి కాస్త భయపడేవాడిని. ఎందుకంటే ఆయనని సైలెంట్‌గా ఉంచడం చాలా కష్టం. వీరూ ఎలాంటి పరిస్థితుల్లో తగ్గడానికి ఏ మాత్రం ఇష్టపడరు...

88

పిచ్ ఎలా ఉన్నా, టీమ్ ఎలాంటి పొజిషన్‌లో ఉన్నా తన ఆటను, స్టైల్‌ను ఏ మాత్రం మార్చుకోవడానికి ఇష్టపడని బ్యాటర్ సెహ్వాగ్... ’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్..

click me!

Recommended Stories