అతడి వల్ల బ్యాటర్లకు నేను టార్గెట్ అయ్యాను.. ఎస్ఆర్హెచ్ స్పీడ్ గన్ పై భువీ షాకింగ్ కామెంట్స్

Published : Apr 18, 2022, 05:28 PM IST

TATA IPL 2022: ఐపీఎల్-15 లో వరుసగా నాలుగు విజయాలతో అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్  గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆ జట్టు  బౌలర్ భువనేశ్వర్ కుమార్.

PREV
17
అతడి వల్ల బ్యాటర్లకు నేను టార్గెట్ అయ్యాను.. ఎస్ఆర్హెచ్ స్పీడ్ గన్ పై భువీ షాకింగ్ కామెంట్స్

సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న ఉమ్రాన్ మాలిక్ వేగం కారణంగా బౌలర్లు తనను టార్గెట్ గా చేసుకుంటున్నారని ఎస్ఆర్హెచ్  కీలక ఆటగాడు భువనేశ్వర్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ అనంతరం ఐపీఎల్ కామెంటేటర్లు... ‘ఉమ్రాన్ మెరుపులు మీకు ఎలా ఉపయోగపడ్డాయి...?’ అని భువీని ప్రశ్నించారు. 

27

ఈ ప్రశ్నకు భువీ సమాధానం చెబుతూ.. ‘సహాయపడటం సంగతి పక్కనబెడితే బౌలర్లకు నేను టార్గెట్ అయ్యాను. ఉమ్రాన్  మెరుపు వేగంతో బంతులు విసురుతున్నాడు. నేనేమో స్వింగ్, లెంగ్త్ తో బౌలింగ్ చేస్తాను. ఉమ్రాన్ స్పీడ్ నాకు లేదు.

37

దీంతో బ్యాటర్లకు నేను టార్గెట్ అయ్యాను. నేను  స్లో గా బౌలింగ్ చేస్తానని  బ్యాటర్లు బాదడానికి నన్ను  టార్గెట్ చేసుకున్నారు..’ అని ఫన్నీగా సమాధానమిచ్చాడు భువీ.  ఇక ఉమ్రాన్  వేగాన్ని, అతడి బౌలింగ్ శైలిని దగ్గర్నుంచి చూడటం ఎంతో సంతోషంగా ఉందన్నాడు ఈ వెటరన్   పేసర్. 

47

పంజాబ్ తో మ్యాచ్ లో  బంతి స్వింగ్ కాకపోవడంతో తాను లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరానని, దాంతో ఫలితం రాబట్టానని భువీ చెప్పాడు. ‘పిచ్  నుంచి స్వింగ్  రాబడదామంటే సహకారం లభించలేదు. దీంతో నేను ప్లాన్ మార్చాను. లెంగ్త్ బంతులు విసిరాను. నేను స్లో బంతులు విసిరితే  శిఖి (ధావన్)  బౌండరీ బాదడానికి ప్రయత్నిస్తాడని నాకు తెలుసు. 

57

దీంతో నేను లెంగ్త్ ను నమ్ముకున్నాను. కాస్త ఊరించే బంతి వేసే సరికి ధావన్ నా   ఉచ్చులో పడ్డాడు. లక్కీగా బాల్ ధావన్ ఎడ్జ్ కు తాకి నాకు వికెట్ దక్కింది..’ అని అన్నాడు.  సన్ రైజర్స్ తో మ్యాచ్ లో  ధావన్... 11 బంతుల్లో 8 పరుగులే చేసి.. భువీ బౌలింగ్ లోనే మార్కో జాన్సేన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

67

ఇక నిన్నటి మ్యాచులో ఉమ్రాన్ మాలిక్ తో పాటు భువీ కూడా ఆకట్టుకున్నాడు. ఉమ్రాన్.. నాలుగు వికెట్లు తీయగా భువీ 3 వికెట్లతో చెలరేగాడు. పంజాబ్ టాపార్డర్ ను కుప్పకూల్చింది భువీనే. శిఖర్ ధావన్ తో పాటు లివింగ్ స్టోన్, షారుఖ్ ఖాన్ లను అతడు పెవిలియన్ కు పంపాడు.

77

తాజా ప్రదర్శనతో భువీ మరో  ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. పంజాబ్ తో మూడు వికెట్లు తీయడంతో భువీ ఐపీఎల్  లో 150 వికెట్లు తీసిన బౌలర్  గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ లో 150 కి పైగా వికెట్లు తీసిన జాబితాలో డ్వేన్ బ్రావో (177), లసిత్ మలింగ (170), అమిత్ మిశ్రా (166), పీయూష్ చావ్లా (157), యుజ్వేంద్ర చాహల్ (151), భువనేశ్వర్ కుమార్ (150) ఉన్నారు. 

click me!

Recommended Stories