ఆర్‌సీబీ వర్సెస్ ఎక్స్‌-ఆర్‌సీబీ... రాజస్థాన్ రాయల్స్‌లో కీ ప్లేయర్లుగా మారిన ఆ ముగ్గురు...

First Published May 27, 2022, 6:41 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ రెండో క్వాలిఫైయర్‌లో ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్‌తో తలబడుతోంది. మొదటి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఓడిన రాజస్థాన్ రాయల్స్, నేటి మ్యాచ్‌లో గెలిచి టైటిల్ ఫైట్‌కి వెళ్లాలని ఆశపడుతుంటే... ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన ఆర్‌సీబీ, 15 ఏళ్లగా తీరని టైటిల్ కలను నెరవేర్చుకోవడంలో మరో అడుగు ముందుకు వేయాలని చూస్తోంది...

రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2008 సీజన్‌లో అండర్‌ డాగ్స్‌గా బరిలో దిగి మొట్టమొదటి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అప్పటి రాజస్థాన్ కెప్టెన్ షేన్ వార్న్, కొన్నాళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే...
 

షేన్ వార్న్‌కి నివాళిగా ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచి, ఆయనకి అంకితం ఇవ్వాలని గట్టి పట్టుదలతో ఉంది రాజస్థాన్ రాయల్స్. ఆర్‌సీబీ కథ వేరేగా ఉంది...

15 సీజన్లుగా ఆర్‌సీబీని టైటిల్ గెలవకుండా అడ్డుకుంటూ వస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈసారి గ్రూప్ స్టేజీకే పరిమితమయ్యాయి. దీంతో ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడూ’ అనే నినాదంతో ఆర్‌సీబీ టైటిల్ వేటలో బరిలో దిగుతోంది..

అయితే రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్న ముగ్గురు మాజీ ఆర్‌సీబీ ప్లేయర్ల నుంచే రాయల్ ఛాలెంజర్స్ గండం పొంచి ఉంది. 8 సీజన్ల పాటు ఆర్‌సీబీకి ఆడిన యజ్వేంద్ర చాహాల్‌ని, ఆ జట్టు రిటైన్ చేసుకోలేదు...

కనీసం మెగా వేలంలో కూడా తిరిగి కొనుగోలు చేయలేదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటికే 26 వికెట్లు తీసిన యజ్వేంద్ర చాహాల్, పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్నాడు. 

క్వాలిఫైయర్ 1లో వికెట్లు తీయలేకపోయిన చాహాల్, రెండో క్వాలిఫైయర్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది... ఆర్‌సీబీతో ఫైనల్ ఆడాలని ఉందని ఆశపడిన యజ్వేంద్ర చాహాల్‌కి ఆ కోరిక కాస్త ముందుగానే తీరింది. దీంతో చాహాల్, తన మాజీ టీమ్‌పై ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది...

ఆర్‌సీబీ ద్వారా వెలుగులోకి వచ్చి, అంతర్జాతీయ ఆరంగ్రేటం కూడా చేసిన ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆర్‌సీబీ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ పడిక్కల్. అయితే పడిక్కల్‌ని రిటైన్ చేసుకోని ఆర్‌సీబీ, తిరిగి కొనుగోలు చేయలేదు...

ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.7.75 కోట్లకు పడిక్కల్‌ని కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్. మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా 15 మ్యాచుల్లో 365 పరుగులతో పర్వాలేదనిపించిన పడిక్కల్, తన పాత జట్టుపై ఎలాంటి పర్పామెన్స్ ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది...

అలాగే ఆర్‌సీబీ ద్వారా ఐపీఎల్ ఆరంగ్రేటం చేసిన ప్లేయర్ సిమ్రాన్ హెట్మయర్. 2019 సీజన్‌లో ఆర్‌సీబీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన హెట్మయర్, ఆ సీజన్‌లో సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఐపీఎల్‌లో హెట్మయర్ అత్యధిక స్కోరు ఇదే...

అయితే ఆ మ్యాచ్ తర్వాత మిగిలిన నాలుగు మ్యాచుల్లో కలిపి 15 పరుగులే చేసిన హెట్మయర్‌ని వేలానికి వదిలేసింది ఆర్‌సీబీ. ఆర్‌సీబీ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కి వెళ్లిన హెట్మయర్‌ని వేలంలో రూ.8.5 కోట్లకు కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్...

దీంతో క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కాస్తా ఆర్‌సీబీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్‌గా కాకుండా ఆర్‌సీబీ వర్సెస్ ఎక్స్-ఆర్‌సీబీ ప్లేయర్ల మధ్య మ్యాచ్‌గా చూస్తున్నారు కొందరు నమ్‌దే బ్యాచ్ ఫ్యాన్స్..

click me!