34 ఏళ్ల వయసులో మూడు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ. కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాక వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ వయసులో మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఎక్కువకాలం కొనసాగేందుకు రోహిత్ ఇష్టపడకపోవచ్చని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...
రోహిత్ శర్మ వన్డే, టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా మరో రెండు, మూడేళ్లు కొనసాగాలని అనుకుంటున్నా, టెస్టు క్రికెట్‌లో కెప్టెన్సీని మాత్రం ఓ యువ క్రికెటర్‌కి అందించాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి...
29
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా ఎక్కువగా వినిపించిన పేరు కెఎల్ రాహుల్. అయితే సౌతాఫ్రికా టూర్‌లో టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న కెఎల్ రాహుల్ తన కెప్టెన్సీతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు...
39
కెఎల్ రాహుల్ కెప్టెన్సీపై బీసీసీఐ ఏ మాత్రం సంతృప్తి చెందకపోవడంతో మరో ఆప్షన్ కోసం వెతుకుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ప్రస్తుత సారథి రిషబ్ పంత్, కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్సీ రేసులో నిలిచారు...
49
తాజాగా ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా కొత్త అవతారం ఎత్తిన హార్ధిక్ పాండ్యా కూడా తన కెప్టెన్సీ స్కిల్స్‌తో అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. అయితే యువీ మాత్రం టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా రిషబ్ పంత్‌ని రిఫర్ చేస్తున్నాడు...
59
Rishabh Pant
‘రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకునేందుకు ఓ యంగ్ క్రికెటర్‌ని సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. మాహీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు అతన్ని ఎవ్వరూ ఫ్యూచర్ కెప్టెన్‌గా చూడలేదు...
69
అయితే మాహీ ఆ బాధ్యతలను చక్కగా పోషించాడు. నా దృష్టిలో వికెట్ కీపర్ ఎప్పుడూ టీమ్ గురించి చాలా విషయాలను బాగా అర్థం చేసుకోగలడు. ముఖ్యంగా బౌలర్లను ఎలా వాడాలో వికెట్ కీపర్‌కి బాగా తెలుస్తుంది...
79
Rishabh Pant
నేను కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నప్పుడు కానీ యువకులమే. పెద్దగా పరిణతి కూడా లేదు. కానీ రిషబ్ పంత్ అలా కాదు...
89
అయితే ఈ వయసులో ఎంతో మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నాడు. టీమిండియా సెలక్టర్లు, సపోర్టింగ్ స్టాఫ్ ఎలా ఆలోచిస్తున్నారో తెలీదు కానీ టెస్టు టీమ్‌ని నడిపించడానికి రిసబ్ పంత్‌యే కరెక్ట్...
99
ఈ వయసులోనే రిషబ్ పంత్ నాలుగు టెస్టు సెంచరీలు బాదాడు. విదేశీ పిచ్‌లపై ఈజీగా పరుగులు చేయగలుగుతున్నాడు. రిషబ్ పంత్ ఫ్యూచర్ లెజెండ్...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్...