అయ్యర్‌ రివెంజ్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా... రిషబ్ పంత్‌తో టీమిండియా కెప్టెన్సీ రేసులో...

Published : Apr 28, 2022, 03:32 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌‌ను టైటిల్ ఫెవరెట్‌గా ఆరంభించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. గత సీజన్‌లో ఫైనల్ చేరినా, టైటిల్ సాధించలేకపోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈసారి అదరగొడుతుందని భావించారంతా. ఆరంభంలో మంచి విజయాలతో ఆకట్టుకుంది కేకేఆర్...

PREV
19
అయ్యర్‌ రివెంజ్ ప్లాన్ వర్కవుట్ అయ్యేనా... రిషబ్ పంత్‌తో టీమిండియా కెప్టెన్సీ రేసులో...

ఐపీఎల్ 2022 సీజన్‌‌ను టైటిల్ ఫెవరెట్‌గా ఆరంభించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. గత సీజన్‌లో ఫైనల్ చేరినా, టైటిల్ సాధించలేకపోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో ఈసారి అదరగొడుతుందని భావించారంతా. ఆరంభంలో మంచి విజయాలతో ఆకట్టుకుంది కేకేఆర్...

29

ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తర్వాత పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉన్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో కనీసం 5 విజయాలు అందుకోవాల్సిందే...

39

మరోవైపు టైటిల్ ఫెవరెట్లలో ఒకటిగా సీజన్‌ని ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. ఫస్టాఫ్‌లో 7 మ్యాచుల్లో 3 విజయాలు మాత్రమే అందుకోగలిగింది ఢిల్లీ...

49

కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 44 పరుగుల తేడాతో విజయం అందుకుంది. డేవిడ్ వార్నర్, పృథ్వీషా హాఫ్ సెంచరీలతో ఢిల్లీకి 215 పరుగుల భారీ స్కోరు అందించారు..

59

శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా కేకేఆర్ 171 పరుగులకే పరిమితమైంది. తనను కెప్టెన్సీ నుంచి తప్పించిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై రివెంజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు శ్రేయాస్ అయ్యర్...

69

టీమిండియా ఫ్చూచర్ కెప్టెన్సీ రేసులో రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. 2019, 2020 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను విజయవంతంగా నడిపించి శ్రేయాస్ అయ్యర్ మంచి మార్కులు కొట్టేసి, ఫ్యూచర్ కెప్టెన్‌‌గా ప్రశంసలు అందుకున్నాడు...
 

79

అయితే 2021 సీజన్ శ్రేయాస్ అయ్యర్‌, టీమిండియా కెప్టెన్సీ ఆశలను తలకిందులు చేసేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్, అందర్నీ మెప్పించి... కెప్టెన్‌గా సెటిల్ అయిపోయాడు...

89

దీంతో శ్రేయాస్ అయ్యర్, తన కెప్టెన్సీ స్కిల్స్‌ను మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం పడింది. టైటిల్ గెలవకపోయినా కనీసం కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ కంటే బెటర్ కెప్టెన్‌గా మార్కులు కొట్టేయాలంటే నేటి మ్యాచ్‌లో కేకేఆర్ గెలిచి తీరాల్సిందే...

99

గత మ్యాచ్‌లో ఒక్క నో బాల్ కోసం నానా రాద్ధాంతం చేసి విమర్శలు ఎదుర్కొన్న రిషబ్ పంత్, ఆ విషయాన్ని మరిపించే విజయం కోసం చూస్తున్నాడు. దీంతో నేటి మ్యాచ్ శ్రేయాస్ అయ్యర్ వర్సెస్ రిషబ్ పంత్‌గా మారిందని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..

Read more Photos on
click me!

Recommended Stories