వెనక్కి తిరిగి చూసుకో.. అప్పుడైనా ఫామ్ లోకి వస్తావ్..! కోహ్లికి టీమిండియా మాజీ ఆల్ రౌండర్ కీలక సూచన

Published : Apr 28, 2022, 03:23 PM IST

Virat Kohli-Yuvraj Singh: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతన్న నేపథ్యంలో అతడు కొన్నాళ్లు విరామం తీసుకుంటే మంచిదని దిగ్గజ ఆటగాళ్లు సూచిస్తున్నారు. మరోవైపు యువరాజ్ సింగ్ కూడా ఈ విషయమై స్పందించాడు. 

PREV
17
వెనక్కి తిరిగి చూసుకో.. అప్పుడైనా ఫామ్ లోకి వస్తావ్..! కోహ్లికి టీమిండియా మాజీ ఆల్ రౌండర్ కీలక సూచన

భారత జట్టులో సచిన్ టెండూల్కర్ తర్వాత సుమారు దశాబ్దానికి పైగా అంతటి కీర్తిని గడించిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి  గత కొద్దికాలంగా వరుసగా విఫలమవుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్-15 లో  కోహ్లి ఆట అతడి అభిమానులకే కాదు ఏకంగా అతడికే  విసుగు తెప్పించేంత అధ్వాన్నంగా ఉంది. 

27

ఈ నేపథ్యంలో  అతడు విరామం తీసుకోవాలని, కొన్ని రోజుల తర్వాత తిరిగి బ్యాట్ పట్టాలని రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్ వంటి ఆటగాళ్లు సూచిస్తున్నారు. అయితే తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. 

37

ఓ జాతీయ ఛానెల్ తో  యువీ మాట్లాడుతూ... ‘ప్రస్తుతం కోహ్లి ఫామ్ అభిమానులకే కాదు.. అతడికి కూడా నచ్చదు.  తన ఆటతీరుపై కోహ్లి కూడా నిరాశలో ఉండి ఉంటాడు. ఎందుకంటే గడిచిన 15 ఏండ్లలో కోహ్లి ఎన్నో బెంచ్ మార్క్ లను సెట్ చేశాడు. 

47

అలవకోగా సెంచరీలు బాదిన  ఆటగాడు ఇప్పుడు ఇలా ఆడుతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అయితే ప్రతి ఆటగాడిలో ఇలాంటి ఒక దశ ఉంటుంది.. 

57

దీనిని అధిగమించాలంటే కోహ్లి తాను కొత్తగా జట్టులో చేరినప్పటి రోజులకు  వెళ్లాలి.  అప్పుడు ఏ ఒత్తిడి లేకుండా ఎలా ఆడాడన్నది కోహ్లికి తెలుసు.  అతడు ప్రస్తుతం సారథ్యం నుంచి విముక్తి పొందాడు. దాంతో పాటు ఈ విమర్శలు, వాదనలు, ఆరోపణల నుంచి  పూర్తిగా స్వేచ్ఛ పొందాలి. అప్పుడు మళ్లీ మనం పాత కోహ్లిని చూడొచ్చు. 
 

67

ఎందుకంటే కోహ్లి గతంలో ఆడినవి మాములు ఇన్నింగ్స్ కావు. నాకు తెలిసి గడిచిన 15 ఏండ్లలో ప్రపంచవ్యాప్తంగా ఏ అథ్లెట్ ను కూడా  ఇలా చూడలేదు. ఈ పదిహేనేండ్ల కాలంలో ప్రఖ్యాతిగాంచిన ప్రతి అథ్లెట్ కంటే కోహ్లి నాలుగు రెట్లు  ఎక్కువ సాధించాడు. కావున కోహ్లి గనక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రస్తుత ఫామ్ అనేదే ఒక సమస్యే కాదు..’ అని చెప్పుకొచ్చాడు. 

77

అంతర్జాతీయ క్రికెట్ లో 2019 తర్వాత సెంచరీ చేయని కోహ్లి.. తాజాగా ఐపీఎల్-2022లో దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్ లో 8 మ్యాచులాడి 128 పరుగులు మాత్రమే చేశాడు.  ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు.  అంతేగాక వరుసగా రెండు సార్లు డకౌటయ్యాడు. 

Read more Photos on
click me!

Recommended Stories