కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం జడేజాకి ఇష్టం లేదా... ధోనీపై చారుశర్మ చేసిన ట్వీట్‌ని లైక్ చేసి...

First Published May 9, 2022, 5:44 PM IST

ఎమ్మెస్ ధోనీ తర్వాత సీఎస్‌కే కెప్టెన్సీ పగ్గాలు తీసుకోవాలని చాలా ఆశపడ్డాడు రవీంద్ర జడేజా. 2022 సీజన్ ఆరంభానికి ముందే సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి ఎమ్మెస్ ధోనీ తప్పుకోవడంతో జడేజాకి ఆ అవకాశం కూడా దక్కింది. అయితే పట్టుమని 10 మ్యాచులు కూడా గడవకుండానే కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు జడ్డూ...
 

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా 8 మ్యాచుల్లో 6 పరాజయాలు అందుకున్న రవీంద్ర జడేజా, కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో సీఎస్‌కే కెప్టెన్‌గా తిరిగి తన పొజిషన్‌లోకి తిరిగి వచ్చాడు ధోనీ...

కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేయర్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు జడేజా. అటు బ్యాట్స్‌మెన్‌గా, ఇటు బౌలర్‌గానే కాకుండా చేతుల్లోకి వచ్చిన ఈజీ క్యాచులను కూడా నేలపాలు చేశాడు...

Latest Videos


కెప్టెన్సీ ప్రెషర్ తట్టుకోలేకనే జడ్డూ ఈ నిర్ణయం తీసుకుంటాడని ప్రచారం జరిగినా... చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలు నుంచి తప్పుకోవడం అతనికి ఏ మాత్రం ఇష్టం లేనట్టు తెలుస్తోంది...

ఎమ్మెస్ ధోనీ తిరిగి కెప్టెన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్లు డివాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. గైక్వాడ్ 99 పరుగుల వద్ద అవుటై సెంచరీ మిస్ చేసుకున్నాడు...

Charu Sharma

‘డివాన్ కాన్వే, గైక్వాడ్ చాలా బాగా ఆడారు. అయితే వాళ్లిద్దరూ ధోనీ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వడం వల్లే ఇలా ఆడారా? అస్సలు కాదు! సీఎస్‌కే ఈ సారి కాస్త లేటుగా ఫామ్‌లోకి వచ్చినట్టుంది. జడేజా ఇకపై హీరోగా మారతాడు...’ అంటూ ట్వీట్ చేశాడు క్రికెట్ కామెంటేటర్, ఐపీఎల్ 2022 సీజన్ ఆక్షనర్ చారు శర్మ...

ఈ ట్వీట్‌ని రవీంద్ర జడేజా లైక్ చేయడంతో అభిమానుల్లో అనుమానాలు రేగాయి. జడ్డూకి కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం ఇష్టం లేదని, టీమ్ మేనేజ్‌మెంట్ బలవంతంగా అతన్ని ఆ పొజిషన్‌ నుంచి తప్పించి ఉంటుందని అంటున్నారు జడేజా ఫ్యాన్స్..

కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకి చోటు దక్కకపోవడం ఈ అనుమానాలకు మరింత ఊతాన్నిస్తోంది.. కెప్టెన్సీ చైర్ల ఆటలో జడ్డూని బలి చేశారని అంటున్నారు ఫ్యాన్స్..

click me!