అతడు ధోని.. అంచనా వేయడం కష్టమే.. తర్వాత సీజన్ కూడా ఆడొచ్చు : షోయభ్ అక్తర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published May 9, 2022, 5:41 PM IST

Shoaib Akhtar About MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ కు అప్రతీహాత విజయాలు అందించిన ఆ జట్టు  సారథి మహేంద్ర సింగ్ ధోని.. ఈ సీజన్ తర్వాత తప్పుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో  పాకిస్తాన్ దిగ్గజ  పేసర్ షోయభ్ అక్తర్  ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఈ సీజన్ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోని భవితవ్యం ఏమిటి..? చెన్నై తరఫునే ఆడతాడా..? లేక కోచింగ్ విభాగానికి వస్తాడా..?  ఐపీఎల్ లో సీఎస్కే అభిమానులతో పాటు ఇతర ఫ్రాంచైజీల ఫ్యాన్స్ లో కూడా ఇప్పుడు ఇదే చర్చ.  

వాస్తవానికి ధోని ఈ సీజన్ లోనే కొన్ని మ్యాచులు ఆడి చెన్నై కి మరో ట్రోఫీ అందించి విజయవంతంగా వీడ్కోలు అందుకుంటాడని అందరూ భావించారు. కానీ  దానికి భిన్నంగా ధోని.. ఈ సీజన్ కు రెండ్రోజుల ముందు రవీంద్ర జడేజాకు సారథ్యం అప్పగించడం.. అతడు ఒత్తిడిని తట్టుకోలేక చతికిలపడటం తో సీన్ రివర్స్ అయి తిరిగి మళ్లీ ధోని చేతికే సీఎస్కే పగ్గాలు వచ్చాయి. 

Latest Videos


ధోని మళ్లీ సారథ్యం చేపట్టాక సీఎస్కే 3 మ్యాచులాడి  రెండిట్లో ఘన విజయం సాధించింది. దీంతో ధోనిని మళ్లీ ఐపీఎల్-2023లో చూస్తామా..? అని అతడి అభిమానుల్లో ఆశలు చిగురించాయి.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయభ్ అక్తర్ ధోని భవితవ్యం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనిని అంచనా వేయడం అంత సులభం కాదని,  అతడి వ్యూహాలు ఎవరికీ అందవని తెలిపాడు. 

అక్తర్ మాట్లాడుతూ.. ‘అతడు ధోని. అతడేంచేస్తాడనేది  ఎవరూ ఊహించలేనిది.  సవాళ్లను స్వీకరించడం ధోనికి ఇష్టం.  అతడేం చేస్తాడో అతడికి చాలా స్పష్టత ఉంది. ధోని చాలా గొప్ప ఆటగాడు. 

ధోనిని మేమంతా ఇష్టపడతాం. అతడిని గౌరవిస్తాం. నా అభిప్రాయం ప్రకారమైతే ధోని  తన రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందు మరో ఐపీఎల్ సీజన్ ఆడతాడనే నమ్మకం నాకుంది. రిటైర్మెంట్ ప్రకటించాక కూడా ధోని..  కోచ్ గానో లేక మేనేజ్మెంట్ (సీఎస్కే) లోనో భాగమవుతాడు..’ అని వ్యాఖ్యానించాడు. 

ఇటీవలే ధోని తిరిగి సారథ్య బాధ్యతలు చేపట్టాక అతడిని మ్యాచ్ ప్రెజెంటర్ డానీ మోరిసన్  సీఎస్కేలో మీ భవిష్యత్ ఏమిటని ప్రశ్నించాడు. దానికి ధోని సమాధానం చెబుతూ.. ‘మీరు తప్పకుండా నన్ను యెల్లో జెర్సీలో చూస్తారు...

అయితే అది ఈ  యెల్లో జెర్సీ (ఆటగాళ్లు వేసుకునేది) లేక మరోకటా (కోచ్ లు ధరించేది) అనేది  రాబోయే రోజుల్లో తెలుస్తుంది..’ అని వ్యాఖ్యానించడం గమనార్హం. 

click me!