ధోనీ హాఫ్ సెంచరీ క్రెడిట్ కొట్టేసిన రవిశాస్త్రి... టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్‌గా ఉంటే...

Published : Mar 27, 2022, 03:57 PM IST

2022 ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు మాహేంద్ర సింగ్ ధోనీ. రెండు సీజన్ల తర్వాత మాహీ బ్యాటు నుంచి వచ్చిన హాఫ్ సెంచరీ ఇదే. 2019 ఏప్రిల్ 21న ఆర్‌సీబీపై 48 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ధోనీ, ఆ తర్వాత తీవ్రంగా డిస్సప్పాయింట్ చేశాడు...  

PREV
110
ధోనీ హాఫ్ సెంచరీ క్రెడిట్ కొట్టేసిన రవిశాస్త్రి... టీమిండియా మాజీ హెడ్ కోచ్, కామెంటేటర్‌గా ఉంటే...

ఐపీఎల్ 2020 సీజన్‌లో ఎమ్మెస్ ధోనీ కేవలం 200 పరుగులు చేయగా ఐపీఎల్ 2021 సీజన్‌లో బ్యాటుతో తీవ్రంగా నిరాశపరిచాడు. గత సీజన్‌లో మాహీ అత్యధిక స్కోరు 18 పరుగులు మాత్రమే...

210

అయితే  ఆండ్రే రస్సెల్ వేసిన 18వ ఓవర్‌లో 3 ఫోర్లతో 14 పరుగులు రాబట్టిన ఎమ్మెస్ ధోనీ, శివమ్ మావి వేసిన 19వ ఓవర్‌లో ఓ ఫోర్, సిక్సర్‌తో 15 పరుగులు రాబట్టాడు...

310

రస్సెల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాది, కెరీర్‌లో 24వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు ఎమ్మెస్ ధోనీ.

410

38 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మహీ 50 పరుగులు చేసిన మాహీ, ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...

510

38 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మహీ 50 పరుగులు చేసిన మాహీ, ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు...

610

ఐపీఎల్‌లో 40 ఏళ్లు దాటిన తర్వాత నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన రాహుల్ ద్రావిడ్, 40 ఏళ్ల 116 రోజుల వయసులో ఆఖరి హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ రికార్డును బ్రేక్ చేశాడు ఎమ్మెస్ ధోనీ...

710

అయితే మాహీ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు  భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి పేరు ట్రెండింగ్‌లో కనిపించడం విశేషం. దీనికి కారణం టీమిండియాకి హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకోవడానికి ముందు క్రికెట్ కామెంటేటర్‌గా స్టార్ స్టేటస్ సంపాదించాడు రవిశాస్త్రి...

810

2007 టీ20 వరల్డ్ కప్ టోర్నీతో పాటు 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మాహీ కొట్టిన హెలికాఫ్టర్ షాట్‌కి రవిశాస్త్రి ఇచ్చిన కామెంటరీ, ఇప్పటికీ మాహీ ఫ్యాన్స్‌కి అలా గుర్తిండిపోయింది...

910

ఇన్నాళ్లు రవిశాస్త్రి, టీమిండియా హెడ్ కోచ్ పొజిషన్‌లో ఉండడం, మాహీ బ్యాటు నుంచి రాకపోవడం... రవిశాస్త్రి తిరిగి కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇచ్చిన మొదటి మ్యాచ్‌లో ధోనీ హాఫ్ సెంచరీతో కమ్‌బ్యాక్ ఇవ్వడం విశేషం...

1010

దీంతో మహేంద్ర సింగ్ ధోనీకి, రవిశాస్త్రి కామెంటరీ చాలా లక్కీగా మారిందని... తన ఆటని అంతకంటే అందంగా పొడిగే రవిశాస్త్రి లేకనే మాహీ బ్యాటు నుంచి అనుకున్న ఇన్నింగ్స్‌లు రాలేదని అంటున్నారు అభిమానులు...

 

Read more Photos on
click me!

Recommended Stories