అతడు సూపర్ స్టార్.. అతడితో నేను పోటీ పడగలనా..? హార్ధిక్ పాండ్యాపై కేకేఆర్ ఆల్ రౌండర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : May 24, 2022, 06:10 PM IST

Venkatesh Iyer vs Hardik Pandya: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేస్తాడని  గతేడాది ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా సెలెక్టర్లు కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ ను భారత జట్టులోకి చోటు కల్పించారు. 

PREV
18
అతడు సూపర్ స్టార్.. అతడితో నేను పోటీ పడగలనా..? హార్ధిక్ పాండ్యాపై కేకేఆర్ ఆల్ రౌండర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీ20 ప్రపంచకప్-2022 కోసం భారత జట్టు కీలక సిరీస్ లు ఆడనున్న నేపథ్యంలో దక్షిణాఫ్రికా తో  జరుగబోయే  ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కు టీమిండియాకు ఎంపికైన వారిలో స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తో పాటు గతేడాది అతడి స్థానంలోనే వచ్చిన వెంకటేశ్ అయ్యర్ కూడా ఉన్నాడు.

28

అయితే గతేడాది గాయం కారణంగా ఫామ్ కోల్పోయి జట్టులో చోటు కూడా కోల్పోయిన పాండ్యా స్థానాన్ని భర్తీ చేయడానికని సెలెక్టర్లు.. ఐపీఎల్-2021 లో కేకేఆర్ తరఫున అదరగొట్టిన (10 మ్యాచులలో 370 రన్స్) వెంకటేశ్ అయ్యర్ ను  భారత జట్టులోకి చోటు కల్పించారు. 

38

పాండ్యా ఇక టీమిండియాలోకి రావడం కష్టమే అని..  వెంకటేశ్ కు లైన్ క్లీయర్ అయినట్టేనని గతంలో వ్యాఖ్యలు వినిపించాయి. ఆరు నెలల పాటు తీవ్రంగా శ్రమించిన పాండ్యా..  ఐపీఎల్-15 లో దుమ్మురేపే ప్రదర్శనలతో  సెలెక్టర్ల దృష్టిని తిరిగి ఆకర్షించాడు.  అదే సమయంలో వెంకటేశ్ అయ్యర్ మాత్రం  ఈ సీజన్ లో అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు.  కానీ దక్షిణాఫ్రికాతో సిరీస్ కు ఈ ఇద్దరూ ఎంపికవడం విశేషం. 

48

కాగా పాండ్యాతో పోటీ గురించి వెంకటేశ్  అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాండ్యా తో తనకు పోటీ లేదని.. అతడు సూపర్ స్టార్ అని.. హార్ధిక్ దగ్గర తాను ఎంతో నేర్చుకుంటానని వ్యాఖ్యానించాడు. 

58

తాజాగా స్పోర్ట్స్ టైగర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేశ్ మాట్లాడుతూ.. ‘హార్ధిక్ తో నాకు పోటీ లేదు. అతడు సూపర్ స్టార్. భారత జట్టుకు అతడు ఎన్నో విజయాలు అందించాడు. భవిష్యత్ లో కూడా అదే కొనసాగిస్తాడని ఆశిస్తున్నా. 

68

రాబోయే సౌతాఫ్రికా సిరీస్ లో అతడితో కలిసి ఆడాల్సి రావడం నాకు అదృష్టకరం.  పాండ్యా దగ్గర నేను ఎంతో నేర్చుకుంటాను. మా ఇద్దరి మధ్య పోటీయే లేదు. నాకంటే పాండ్యా చాలా ముందున్నాడు. నేను అతడితో పాటు కలిసి ఆడాలనుకుంటున్నాను..’ అని చెప్పాడు. 

78

కాగా.. గత ఐపీఎల్ లో రెండో దశలో అదరగొట్టిన వెంకటేశ్ ఈ సీజన్ లో మాత్రం చతికిలపడ్డాడు. కేకేఆర్ తరఫున 12 మ్యాచులాడి 182 పరుగులే చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. 

88

అదే సమయంలో పాండ్యా మాత్రం ఆకట్టుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా ఉంటూ.. 13 మ్యాచులలో  413 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫిఫ్టీలు కూడా ఉన్నాయి. ఇక బౌలింగ్ లో కూడా నాలుగు వికెట్లు తీశాడు. 

click me!

Recommended Stories