రిషబ్ పంత్‌ని ధోనీతో పోల్చకండి, అందరూ తప్పులు చేస్తారు... సౌరవ్ గంగూలీ కామెంట్...

First Published May 24, 2022, 6:41 PM IST

టీమిండియా కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఓ రేంజ్‌ క్రియేట్ చేసి వెళ్లాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఆ స్థానంలోకి వచ్చిన రిషబ్ పంత్, ఆరంభంలో అవమానాలు ఎదుర్కోగా ఇప్పుడు విమర్శలు చవిచూస్తున్నాడు... అయితే రిషబ్ పంత్‌ని ధోనీతో పోల్చవద్దని అంటున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ...

వికెట్ కీపర్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ సూపర్ సక్సెస్ సాధించడంలో ఐపీఎల్‌లో చాలా ఫ్రాంఛైజీలు ఇదే ఫార్ములాని ఫాలో అయ్యాయి. సంజూ శాంసన్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఈ విధంగా కెప్టెన్సీ ఛాన్సులు కొట్టేసినవాళ్లే...

సంజూ శాంసన్, కెఎల్ రాహుల్‌తో పోలిస్తే రిషబ్ పంత్ కెప్టెన్‌గా మొదటి సీజన్‌లోనూ సంచలనం క్రియేట్ చేశాడు. టేబుల్ టాపర్‌గా ఢిల్లీ క్యాపిటల్స్‌ని ప్లేఆఫ్స్‌కి తీసుకెళ్లాడు...

Latest Videos


అయితే 2022 సీజన్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్‌కి అడుగు దూరంలో నిలిచిపోయింది. 7 విజయాలు అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, తప్పక గెలవాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఓడి ఐదో స్థానానికే పరిమితమైంది...

తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో డీఆర్‌ఎస్ తీసుకునే విషయంలో రిషబ్ పంత్ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. బ్యాటుకి తగులుతూ వచ్చిన క్యాచ్‌కి డీఆర్‌ఎస్ తీసుకోకుండా అవుట్ సైట్ లైన్ పిచ్ అవుతున్న బంతికి ఎల్బీడబ్ల్యూ కోరడం పంత్‌పై విమర్శలు రావడానికి కారణమైంది...

Rishabh Pant

డీఆర్‌ఎస్ తీసుకోవడంలో రిషబ్ పంత్ చేసిన పొరపాట్లే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి లక్కీగా మారి... వరుసగా మూడో సీజన్‌లో ప్లేఆఫ్స్‌ వెళ్లేందుకు మార్గం వేశాయంటూ ట్రోల్స్ వచ్చాయి...

‘రిషబ్ పంత్‌ని ఎమ్మెస్ ధోనీతో ఎప్పుడూ పోల్చి చూడకండి. ధోనీకి ఎంతో అనుభవం ఉంది. అతను 500లకు పైగా మ్యాచులు ఆడాడను. ఐపీఎల్, టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అపారమైన అనుభవం ఉంది...

రిషబ్ పంత్ కెరీర్ ఇప్పుడిప్పుడే మొదలైంది. అప్పుడు రిషబ్ పంత్, ఎమ్మెస్ ధోనీ చేసినవన్నీ చేసేయాలని అనుకుంటే ఎలా... పంత్‌ని ధోనీతో పోల్చి చూడడం కరెక్టు కాదు...’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

Image credit: Getty

‘ప్రతీ ఒక్కరూ తప్పులు చేస్తారు. మనిషి అన్నాక ఏదో ఒక్క తప్పు చేయాల్సిందే. కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డులు అద్భుతం. ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచాడు, ఆసియా కప్ గెలిచాడు...
 

కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డులు ఉన్న రోహిత్ శర్మ, ఈ సీజన్‌లో కొన్ని తప్పులు చేశాడు. వాటిని సరిదిద్దుకుని టీమిండియాకి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ అందిస్తాడన్న నమ్మకం మాకు ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు గంగూలీ...

click me!