రాజస్థాన్ రాయల్స్ జోరు! ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, టేబుల్ టాపర్, ఫెయిర్ ప్లే... అన్నింట్లోనూ వారే!

Published : Apr 23, 2022, 02:15 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్, దుమ్మురేపే ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఇప్పటిదాకా 7 మ్యాచులు ఆడిన ఆర్ఆర్, 5 విజయాలు అందుకుని టేబుల్ టాపర్‌గా నిలిచింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫుల్లు డామినేషన్ చూపిస్తోంది...

PREV
16
రాజస్థాన్ రాయల్స్ జోరు! ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్, టేబుల్ టాపర్, ఫెయిర్ ప్లే... అన్నింట్లోనూ వారే!

ఐపీఎల్ 2022 సీజన్‌లో 3 సెంచరీలు చేసిన జోస్ బట్లర్, 491 పరుగులు చేసి 81.83 యావరేజ్‌తో ఆరెంజ్ క్యాప్ రేసులో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచాడు...

26


గత రెండు సీజన్లలో ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచిన కెఎల్ రాహుల్‌కి, జోస్ బట్లర్‌కి మధ్య దాదాపు 230 పరుగుల వ్యత్యాసం ఉందంటే... రాయల్స్ బ్యాటర్ డామినేషన్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు...

36

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 116 పరుగులు చేసి... ఐపీఎల్ 2022 సీజన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాటర్‌గానూ టాప్‌లో నిలిచాడు...

46

ఐపీఎల్ 2022 సీజన్‌లో 41 ఫోర్లు బాదిన జోస్ బట్లర్, 32 సిక్సర్లు బాదాడు. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అత్యధిక ఫోర్లు, అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు రాయల్స్ బ్యాటర్...

56

7 మ్యాచుల్లో 18 వికెట్లు తీసిన రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చాహాల్, పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు. కేకేఆర్‌పై హ్యాట్రిక్ తీసి ఈ సీజన్‌లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేసిన చాహాల్, 2022లో ఐదు వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు...

66

అంతేకాకుండా ఐపీఎల్ 2022 సీజన్ ఫెయిర్ ప్లే అవార్డు రేసులోనే మిగిలిన జట్ల కంటే ముందంజలో ఉన్న రాజస్థాన్ రాయల్స్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌ రేసులోనూ టాప్‌లో నిలవడం విశేషం...

click me!

Recommended Stories