ఐపీఎల్ 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా చెత్త రికార్డు క్రియేట్ చేసింది ముంబై ఇండియన్స్. ఈ సీజన్‌లో వరుసగా ఏడు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్, సగం సీజన్ ముగిసిన తర్వాత కూడా తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది...
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి ఓడింది ముంబై ఇండియన్స్. సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మరోసారి ఆఖర్లో మెరుపులు మెరిపించి మ్యాచ్‌ని ఫినిష్ చేశాడు...
28
ఆఖరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 17 పరుగులు కావాల్సి రాగా జయ్‌దేవ్ ఉనద్కత్ వేసిన ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్ చివరి నాలుగు బంతుల్లో 6, 4, 2, 4 బాది మ్యాచ్‌ని ముగించాడు మహేంద్ర సింగ్ ధోనీ..
38
‘చూస్తుంటే ధోనీ బ్యాటింగ్ చేస్తున్నాడని జయ్‌దేవ్ ఉనద్కత్ భయపడి బౌలింగ్ చేసినట్టు ఉంది. ఏదో నిద్రలో బౌలింగ్ వేస్తున్నట్టు పరిస్థితి అర్థం చేసుకోకుండా బౌలింగ్ చేశాడు జయ్‌దేవ్...
48
ధోనీ ఏం చేయగలడో జయ్‌దేవ్ ఉనద్కత్‌కి తెలియనది కాదు. ఈ వయసులో కూడా మహీ సిక్సర్లు బాదుతున్నాడు. అయితే ప్రతీ బాల్‌కి సిక్సర్ కొట్టలేదు...
58
ఎలాంటి బాల్స్ వేస్తే మాహీ షాట్స్ ఆడలేడో బౌలర్‌కి ఓ అవగాహన వచ్చి ఉండాలి. మూడు బంతుల్లో 12 పరుగులు వచ్చిన తర్వాత జయ్‌దేవ్ లైన్ అండ్ లెంగ్త్‌లో ఎలాంటి వ్యత్యాసం చూపించలేదు...
68
ఇలాంటి బౌలింగ్ వేస్తే మాహీకి 60 ఏళ్ల వచ్చిన తర్వాత కూడా సిక్సర్లు కొట్టగలడు. జయ్‌దేవ్ ఉనద్కత్ వేసిన మొదటి బంతి చూసినప్పుడే, ఇతను పరుగులు ఇచ్చేస్తాడని అనుకున్నా...
78
అనుకున్నట్టే సాధారణ పేస్‌తో, మాహీకి కావాల్సిన స్లాట్‌లో బాల్స్ వేసి... పరుగులు ఇచ్చాడు జయ్‌దేవ్ ఉనద్కత్. గుడ్ లెంగ్త్ బాల్స్ వేయడం కూడా తెలియకపోతే అతను ఎప్పటికీ స్టార్ బౌలర్ కాలేడు...
88
ఆఖరి ఓవర్ జయ్‌దేవ్ ఉనద్కత్‌కి ఇవ్వకపోయి ఉంటే ముంబై ఇండియన్స్ కచ్ఛితంగా గెలిచి ఉండేది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్...