రాహుల్ త్రిపాఠికి మరోసారి మొండిచేయి చూపించిన సెలక్టర్లు... టీమిండియాలోకి రావాలంటే ఇంకేం చేయాలి...

Published : May 22, 2022, 06:03 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ అండర్‌రేటెడ్ ప్లేయర్లలో రాహుల్ త్రిపాఠి ఒకడు. డైవ్ చేస్తూ కళ్లు చెదిరే క్యాచులు అందుకునే రాహుల్ త్రిపాఠి, బ్యాటుతో మ్యాజిక్ చేయగలడు. మోస్ట్ హార్డ్‌ వర్కింగ్ క్రికెటర్లలో ఒకడైన రాహుల్ త్రిపాఠికి టీమిండియాలో మాత్రం చోటు దక్కడం లేదు...

PREV
17
రాహుల్ త్రిపాఠికి మరోసారి మొండిచేయి చూపించిన సెలక్టర్లు... టీమిండియాలోకి రావాలంటే ఇంకేం చేయాలి...

31 ఏళ్ల రాహుల్ త్రిపాఠి ఆరు సీజన్లుగా ఐపీఎల్ ఆడుతున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో 75 మ్యాచులు ఆడిన రాహుల్ త్రిపాఠి, 73 ఇన్నింగ్స్‌ల్లో 28.22 సగటుతో 141.22 స్ట్రైయిక్ రేటుతో 1778 పరుగులు చేశాడు...

27

ఐపీఎల్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠియే. గత సీజన్‌లో కేకేఆర్ తరుపున ఆడిన రాహుల్ త్రిపాఠి 17 మ్యాచుల్లో 397 పరుగులు చేశాడు...

37

గత సీజన్‌లో కేకేఆర్ సక్సెస్‌లో వెంకటేశ్ అయ్యర్ ఎక్కవ క్రెడిట్ కొట్టేసినా రాహుల్ త్రిపాఠి ఆడిన మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్‌లను ఏ మాత్రం తక్కువ చేయలేం... 

47

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన రాహుల్ త్రిపాఠి, 13 మ్యాచుల్లో 39.30 సగటుతో 161.73 స్ట్రైయిక్ రేటుతో 393 పరుగులు చేశాడు. మూడు మ్యాచుల్లో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్‌లను ముగించాడు...

57
Rahul Tripathi

కేన్ విలియంసన్ అట్టర్ ఫ్లాప్ అయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటిదాకా 6 మ్యాచుల్లో గెలిచిందంటే దానికి రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్‌లే ప్రధాన కారణం. దీంతో ఈసారి ఎలాగైనా త్రిపాఠికి సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో చోటు దక్కుతుందని భావించారు అభిమానులు...

67

అయితే రాహుల్ త్రిపాఠికి మరోసారి మొండిచేయి చూపించారు బీసీసీఐ సెలక్టర్లు. ఈ సీజన్‌లో పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్‌లకు కూడా అవకాశం ఇచ్చిన సెలక్టర్లు, రాహుల్ త్రిపాఠిని పక్కనబెట్టడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి...

77
Image Credit: Getty Images

అలాగే ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున అదరగొడుతూ 420+ పరుగులు చేసిన శిఖర్ ధావన్‌కి కూడా టీమ్‌లో చోటు ఇవ్వలేదు సెలక్టర్లు. గత 7 సీజన్లలోనూ 400+ పరుగులు చేసిన గబ్బర్, టీ20ల్లో చోటు మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు.

click me!

Recommended Stories