చెన్నై గెలిచింది నాలుగే కానీ, ఐదు మంచి విషయాలు జరిగాయి... ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ...

Published : May 22, 2022, 05:24 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ని డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మొదలెట్టింది చెన్నై సూపర్ కింగ్స్. 2020 సీజన్ పరాభవం తర్వాత 2021లో టైటిల్ గెలిచిన సీఎస్‌కే, 2022 సీజన్‌లో నాలుగంటే నాలుగే విజయాలు అందుకుంది... అయితే సీఎస్‌కే విషయంలో నాలుగు మంచి విషయాలు జరిగాయంటున్నాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

PREV
18
చెన్నై గెలిచింది నాలుగే కానీ, ఐదు మంచి విషయాలు జరిగాయి... ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషణ...
Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభానికి ముందు ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఆ తర్వాత రవీంద్ర జడేజా సారథ్య బాధ్యతలు అందుకోవడం, దీపక్ చాహార్ అందుబాటులో లేకపోవడం.. మెగా వేలంలో సరైన ప్లేయర్లను కొనుగోలు చేయకపోవడం... సీఎస్‌కే పర్ఫామెన్స్‌పై తీవ్రంగా ప్రభావం చూపాయి...

28
Image credit: PTI

గత సీజన్‌లో సీఎస్‌కే తరుపున రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లిసిస్ ఇద్దరూ 620+ పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ 2 ప్లేసుల్లో నిలిచారు. ఈ సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ ఒక్కడు తప్ప మిగిలిన సీఎస్‌కే ప్లేయర్లు ఎవ్వరూ 300+ స్కోరు కూడా చేయలేకపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు...

38

ముఖేశ్ చౌదరి, డీజే బ్రావో, మొయిన్ ఆలీ వికెట్లు తీసి పర్వాలేదనిపించినా, శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప వంటి ప్లేయర్లు కొన్ని మ్యాచుల్లో బ్యాటుతో మెరుపులు మెరిపించినా... సీఎస్‌కేకి విజయాలు అందించలేకపోయారు...

48

‘చెన్నై సూపర్ కింగ్స్‌కి ఈ సీజన్‌లో ఏదీ కలిసి రాలేదు. ప్లేఆఫ్స్‌కి చేరకుండానే ఇంటికి వెళ్తున్నారు. అయితే సీఎస్‌కే ఫ్యాన్స్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెన్నై విషయంలో ఐదు పాజిటివ్ విషయాలు జరిగాయి...
 

58

ముకేశ్ చౌదరి, డివాన్ కాన్వే, మహీశ్ తీక్షణ, సిమర్‌జీత్ సింగ్, మత్తీశ పతిరాన రూపంలో ఐదుగురు మ్యాచ్ విన్నర్లు... సీఎస్‌కేకి దొరికారు. వీరిని కరెక్టుగా వాడుకుంటే వచ్చే సీజన్‌లో అద్భుతమైన రీఎంట్రీ ఇవ్వొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు ఇర్ఫాన్ పఠాన్...

68

ముకేశ్ చౌదరి ఈ సీజన్‌లో 16 వికెట్లు తీయగా, డివాన్ కాన్వే 7 మ్యాచుల్లో 3 హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలతో 252 పరుగులు చేశాడు... 

78

సిమర్‌జీత్ సింగ్ 6 మ్యాచుల్లో 4 వికటె్లు తీశాడు. అయితే 7.67 సగటుతో బౌలింగ్ చేసి అందర్నీ ఇంప్రెస్ చేశాడు సిమర్‌జీత్ సింగ్. మహీశ్ తీక్షణ ఈ సీజన్‌లో 9 మ్యాచులు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు...

88
Image credit: PTI

గాయపడిన ఆడమ్ మిల్నే స్థానంలో సీఎస్‌కే జట్టులో చోటు దక్కించుకున్న లంక యంగ్ పేసర్ మత్తీశ పతిరాన 2 మ్యాచులు ఆడి 2 వికెట్లు పడగొట్టాడు. మలింగ బౌలింగ్ యాక్షన్‌తో బంతులు వేసే పతిరాన, 7.61 ఎకానమీతో సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో తనదైన ముద్ర వేశాడు..

click me!

Recommended Stories