మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా చేసి తప్పు చేశారు, శిఖర్ ధావన్‌కి ఇవ్వాల్సింది... పంజాబ్ కింగ్స్‌పై...

Published : May 18, 2022, 05:33 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా కెరీర్ మొదలెట్టిన వారిలో మయాంక్ అగర్వాల్ ఒకడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 13 మ్యాచుల్లో 6 మ్యాచులు గెలిచిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలై, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది...

PREV
19
మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా చేసి తప్పు చేశారు, శిఖర్ ధావన్‌కి ఇవ్వాల్సింది... పంజాబ్ కింగ్స్‌పై...

కెప్టెన్‌గా పర్వాలేదనిపిస్తున్నా, ఐపీఎల్ 2022 సీజన్‌లో బ్యాట్స్‌మెన్‌గా మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్...

29

గత రెండు సీజన్లలో 300+ పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్, 12 మ్యాచుల్లో 125 స్ట్రైయిక్ రేటుతో 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు... ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 160 పరుగుల ఈజీ లక్ష్యఛేదనలో మయాంక్ అగర్వాల్ డకౌట్ కావడం జట్టుపై తీవ్రంగా ప్రభావం చూపింది...

39

‘ఐపీఎల్‌లో ఈసారి చాలా చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. ఈసారి ఎవ్వరూ ఊహించని ప్లేయర్లు, కెప్టెన్లుగా మారారు. సంజూ శాంసన్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ అవుతాడని ఎవ్వరైనా ఊహిస్తారు...

49

కానీ మయాంక్ అగర్వాల్‌కి కెప్టెన్సీ దక్కుతుందని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ టీమ్‌లో చాలా మంది ప్లేయర్లకు కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి...

59
Shreyas Iyer

అయితే కొన్నిసార్లు కొందరు ప్లేయర్లు, తమ కెప్టెన్సీ స్కిల్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. శ్రేయాస్ అయ్యర్ అలా వచ్చినవాడే. అతను కెప్టెన్ అయినప్పుడు ఎవ్వరూ సక్సెస్ అవుతాడని అనుకోలేదు...

69

అలాగే హార్ధిక్ పాండ్యా... పాండ్యాని కెప్టెన్‌గా ఎంచుకోవడమే గుజరాత్ టైటాన్స్ తప్పని అనుకున్నాం... కానీ అతను టీమ్‌ని సూపర్‌గా నడిపిస్తున్నాడు... కెప్టెన్సీ అతనికి ఏ మాత్రం భారంగా అనిపించడం లేదు..

79
Mayank Agarwal

మయాంక్ అగర్వాల్ కూడా కెప్టెన్సీని చాలా సీరియస్‌గా తీసుకున్నాడు. అతను జట్టు కోసం త్యాగాలు చేయడానికి కూడా వెనకాడడం లేదు. అది మంచిదే...

89
Mayank Agarwal

అయితే మయాంక్ అగర్వాల్‌లోని బ్యాట్స్‌మెన్ సంగతేంటి? మయాంక్ చాలా మంచి హిట్టర్. అతను ఎలాంటి షాట్లు ఆడగలడో అందరికీ తెలుసు. మయాంక్‌ని కెప్టెన్‌గా ఎంచుకని, ఓ మంచి బ్యాటర్‌ని కోల్పోయింది పంజాబ్ కింగ్స్...

99

మయాంక్ అగర్వాల్ కంటే శిఖర్ ధావన్ కెప్టెన్సీకి చాలా మంచి ఆప్షన్ అవుతుండే.. టాపార్డర్‌లో మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కంటే బాగా ఆడతాడు. అతన్ని కెప్టెన్సీతో కట్టేసి, పంజాబ్ చాలా పెద్ద మిస్టేక్ చేసింది...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...

click me!

Recommended Stories