ఐపీఎల్ 2022 సీజన్ దాదాపు సగానికి చేరుకుంది. టీఆర్పీ రికార్డులు బ్రేక్ కాకపోయినా, ఫ్యాన్ బేస్ భారీగా ఉన్న ఫ్రాంఛైజీలు విజయాల బాట పట్టకున్నా... క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ టన్నుల్లో అందిస్తోంది ఐపీఎల్. అక్టోబర్‌లో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టును నిర్ణయించనుంది ఐపీఎల్ 2022 సీజన్...
కారణం ఏమైనా యజ్వేంద్ర చాహాల్ లేకుండా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడి భారీ మూల్యం చెల్లించుకుంది టీమిండియా. భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్న వరుణ్ చక్రవర్తి, అట్టర్ ఫ్లాప్ అయ్యాడు...
214
ఐపీఎల్ 2022 సీజన్‌లో పర్పుల్ క్యాప్ రేసులో దూసుకుపోతున్న యజ్వేంద్ర చాహాల్, ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు ఖాయం చేసుకున్నాడు. గాయం, లేదా మరేదైనా వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటే తప్ప, చాహాల్... టీ20 వరల్డ్ కప్ ఆడడం గ్యారెంటీ...
314
గత సీజన్‌లలో కేకేఆర్ రిజర్వు బెంచ్‌లో మగ్గిపోయిన కుల్దీప్ యాదవ్, ఈ సీజన్‌లో అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చాడు. తన చైనామెన్ యాక్షన్‌తో అదరగొడుతున్న కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహాల్‌తో కలిసి బరిలో దిగే అవకాశం ఉంది... అయితే జడేజా కాకుండా ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తేనే కుల్దీప్ బరిలో దిగుతాడు...
414
గాయం నుంచి పూర్తిగా కోలుకోకముందే టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడాడు ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా. వరల్డ్ కప్ తర్వాత పూర్తిగా నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకున్న హార్దిక్ పాండ్యా, ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొడుతున్నాడు...
514
అటు బాల్‌తో, ఇటు బ్యాటింగ్‌తో, మరోపక్క ఫీల్డింగ్, ఇంకో పక్క కెప్టెన్సీలోనూ తనదైన మార్కు చూపిస్తున్న హార్ధిక్ పాండ్యా... టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడడం గ్యారెంటీ. అయితే అతను పూర్తి ఫిట్ ఉంటేనే ఇది వీలవుతుంది...
614
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీకి ఫినిషర్‌గా మారాడు సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. 37 ఏళ్ల వయసులో భారీ షాట్లతో మ్యాచ్‌లను మలుపు తిప్పుతున్న దినేశ్ కార్తీక్‌పై సెలక్టర్లు ఎంత నమ్మకం ఉంచుతారనేది హాట్ టాపిక్‌గా మారింది..
714
ఇప్పటికే ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, సంజూ శాంసన్ వంటి యంగ్ వికెట్ కీపింగ్ బ్యాటర్లు టీమిండియాలో ఉన్నారు. వీరితో పాటు దినేశ్ కార్తీక్‌కి టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో చోటు దక్కడం అనుమానమే...
814
అయితే ఐపీఎల్ 2022 సీజన్ ఆసాంతం దినేశ్ కార్తీక్ ఇదే రకమైన పర్ఫామెన్స్ ఇస్తే మాత్రం, సెలక్టర్లు... ఈ సూపర్ సీనియర్‌పై కరుణ చూపించవచ్చు...
914
ఉమ్రాన్ మాలిక్... ఐపీఎల్ 2022 సీజన్‌లో సెన్సేషన్‌గా మారాడు. సగటున 150+ కి.మీ.ల వేగంతో బుల్లెట్ బంతులు వేస్తున్న ఉమ్రాన్ మాలిక్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడతాడని చెప్పడం కష్టమే...
1014
ఎందుకంటే ఇప్పటికే భారత జట్టులో జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ బౌలర్లు ఉన్నారు. వీరితో పాటు దీపక్ చాహార్ కూడా వరల్డ్ కప్ సమయానికి అందుబాటులోకి రావచ్చు...
1114
ఐపీఎల్ 2022 సీజన్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్న టీ నటరాజన్ కూడా ఉమ్రాన్ మాలిక్‌కి పోటీగా రావచ్చు. ఇంతమంది పేస్ బౌలింగ్ ఆప్షన్లలో ఉమ్రాన్ మాలిక్, తుదిజట్టులో చోటు దక్కించుకోవాలంటే... అతని నుంచి నిలకడైన ప్రదర్శన రావాల్సిందే...
1214
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడతాడని భావించారు కొందరు క్రికెట్ విశ్లేషకులు. అయితే ఐపీఎల్ 2022 టోర్నీలో అతని పర్ఫామెన్స్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు... కాబట్టి సిరాజ్ మియ్యా, టీ20 వరల్డ్ కప్ ఆడాలంటే ఇకపై బంతితో ఫైరింగ్ పర్ఫామెన్స్ ఇవ్వాలి...
1314
ప్రసిద్ధ్ కృష్ణ... ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చిన యంగ్ పేసర్, పరుగులు ఎక్కువే ఇస్తాడు, వికెట్లు ఎక్కువే తీస్తాడు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. అయితే సీనియర్లతో పోటీపడి వరల్డ్ కప్ ఆడే ఫ్లైట్ ఎక్కాలంటే ప్రసిద్ధ్ కృష్ణ నుంచి కొన్ని బెస్ట్ స్పెల్స్ రావాలి...
1414
గాయం కారణంగా జట్టుకి దూరమై, టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడలేకపోయిన శ్రేయాస్ అయ్యర్... బ్లూ జెర్సీలో ఆకట్టుకున్నాడు. కేకేఆర్ కెప్టెన్‌గానూ నిలకడైన పర్ఫామెన్స్ ఇస్తున్నాడు... సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ ఆస్ట్రేలియా ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.