విరాట్ కోహ్లీ రికార్డే కాదు, వార్నర్ భాయ్ రికార్డు కూడా సేఫ్... బట్లర్ బాబాయ్ ఆశలన్నీ...

Published : May 16, 2022, 01:16 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ఆరంభంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్‌ని ఓ రేంజ్‌లో భయపెట్టాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్. వరుస సెంచరీలతో చెలరేగిన బట్లర్, ఐపీఎల్ 2016లో విరాట్ కోహ్లీ నెలకొల్పిన 973 పరుగుల రికార్డు బ్రేక్ చేస్తాడేమోనని అనిపించింది...

PREV
19
విరాట్ కోహ్లీ రికార్డే కాదు, వార్నర్ భాయ్ రికార్డు కూడా సేఫ్... బట్లర్ బాబాయ్ ఆశలన్నీ...

మొదటి 7 మ్యాచుల్లో 3 సెంచరీలు బాదిన జోస్ బట్లర్, 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ నాలుగు సెంచరీల రికార్డును బ్రేక్ చేస్తాడని... 973 పరుగుల రికార్డును కూడా అందుకుంటాడని భావించారు అభిమానులు...

29

ఒకానొక దశలో సీజన్‌లో 10 మ్యాచులు ముగిసే సమయానికి విరాట్ కోహ్లీ 2016లో మొదటి 10 మ్యాచుల్లో చేసిన పరుగుల కంటే జోస్ బట్లర్, ఈ సీజన్‌లో చేసిన పరుగులే ఎక్కువ. దీంతో విరాట్ రికార్డు డేంజర్‌లో పడిందని కోహ్లీ ఫ్యాన్స్ కంగారు పడ్డారు...

39

ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి 7 మ్యాచుల్లో 81.8 యావరేజ్‌తో 2 హాఫ్ సెంచరీలు, 3 సెంచరీలతో 491 పరుగులు చేశాడు జోస్ బట్లర్. అయితే ఆ తర్వాత 6 మ్యాచుల్లో కలిపి ఒకే హాఫ్ సెంచరీ రాగా 22.7 యావరేజ్‌తో 136 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 3 సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే అవుట్ అయ్యాడు.

49

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 52 బంతుల్లో 67 పరుగులు చేసిన జోస్ బట్లర్, ఆ తర్వాత కేకేఆర్‌పై 22, పంజాబ్ కింగ్స్‌పై 30, ఢిల్లీ క్యాపిటల్స్‌పై 7 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

59

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 బంతుల్లో 2 పరుగులు చేసి యంగ్ బౌలర్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు జోస్ బట్లర్. దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు... విరాట్ కోహ్లీ 973 పరుగుల విరాట్ కోహ్లీ రికార్డు మాత్రమే కాదు, డేవిడ్ వార్నర్ 848 పరుగుల రికార్డు కూడా సేఫ్ అంటున్నారు ఫ్యాన్స్...

69

రాజస్థాన్ రాయల్స్‌కి ఇంకా ఓ లీగ్ మ్యాచ్ మిగిలి ఉంది. ఆ తర్వాత ప్లేఆఫ్స్‌లో రెండు లేదా మూడు మ్యాచులు ఆడొచ్చు. అంటే మొత్తంగా నాలుగు మ్యాచులు అనుకున్నా... డేవిడ్ వార్నర్ 848 రికార్డును అందుకోవాలంటే ఇంకా 221 పరుగులు చేయాల్సి ఉంటుంది జోస్ బట్లర్...
 

79

2018లో 659 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, అదే సీజన్‌లో 684 పరుగులు చేసిన రిషబ్ పంత్ కంటే జోస్ బట్లర్ స్ట్రైయిక్ రేటు చాలా తక్కువగా ఉంది. కెఎల్ రాహుల్ 158, రిషబ్ పంత్ 173 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేస్తే, బట్లర్ స్ట్రైయిక్ 149 మాత్రమే...

89

ప్రస్తుత సీజన్ ఫస్టాఫ్‌లో జోస్ బట్లర్ బ్యాటింగ్, 2016లో విరాట్ కోహ్లీని తలపిస్తే, సెకండాఫ్‌లో అతని బ్యాటింగ్‌ 2022లో విరాట్‌ను మరిపిస్తోందని అంటున్నారు ట్రోలర్స్...

99

సీజన్‌ మొత్తం నిలకడైన ప్రదర్శన చూపిస్తూ 973 పరుగులు చేయాలంటే అది అందరి వల్ల అయ్యే పని కాదని, విరాట్ రికార్డును అయితే గియితే మళ్లీ విరాట్ కోహ్లీయే బ్రేక్ చేయగలడని అంటున్నారు ఆయన అభిమానులు... బట్లర్ కనీసం వార్నర్ రికార్డును కొట్టి చూపించాలని ట్రోల్ చేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories