లక్నో ఓడింది, ఆ ఐదు జట్ల లక్ కూడా మారింది... ఇక ప్లేఆఫ్స్ వార్ వన్‌సైడే...

First Published May 16, 2022, 11:39 AM IST

ఐపీఎల్ 2022 సీజన్ ప్రీ క్లైమాక్స్ స్టేజీకి చేరుకుంది. ఇప్పటికే మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్, 9 టైటిల్ విన్నర్స్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోగా, న్యూ ఎంట్రీ గుజరాత్ టైటాన్స్ 

ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుసగా నాలుగు విజయాలు అందుకుని, కేకేఆర్‌ని ఓడించిన తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌లోకి దూసుకెళ్లింది లక్నో సూపర్ జెయింట్స్... 

గుజరాత్ టైటాన్స్‌తో ప్లేఆఫ్స్ బెర్త్ కోసం మ్యాచ్ ఆడి ఓడిపోయిన లక్నో సూపర్ జెయింట్స్, తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది... ఈ పరాజయం లక్నో సూపర్ జెయింట్స్ కంటే ఎక్కువగా మిగిలిన ఐదు ఫ్రాంఛైజీలపై ఎఫెక్ట్ చూపింది...

13 మ్యాచుల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆఖరి లీగ్ మ్యాచ్‌ని గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే ఆర్‌సీబీ ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది.

ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరిన గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయం అందుకుంటే టాప్ 4లో తన పొజిషన్‌ని కాపాడుకోగలుగుతుంది ఆర్‌సీబీ. ఓడితే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది...

12 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, తన తర్వాతి మ్యాచుల్లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్‌లతో మ్యాచులు ఆడనుంది.

ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లతో ఉంటుంది. ఆర్‌సీబీ, గుజరాత్ టైటాన్స్‌పై గెలిస్తే, ఢిల్లీ క్యాపిటల్స్‌ నెట్ రన్ రేటు మీద ఆధారపడి టాప్ 4 పొజిషన్ నిర్ణయించబడుతుంది...

13 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న కేకేఆర్, ప్లేఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్టే. కేకేఆర్, తన ఆఖరి లీగ్ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనుంది. అది గెలిచినా ఆర్‌సీబీ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడి, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆఖరి రెండు మ్యాచుల్లో ఓడితే... నెట్ రన్ రేట్ కారణంగా టాప్ 4లో ముగించగలుగుతుంది కోల్‌కత్తా...

అయితే ఆఖరి లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై కేకేఆర్ భారీ విజయం అందుకుంటే... ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ జట్లకు ప్లేఆఫ్స్ అవకాశాలు మెరగవుతాయి. 8 విజయాలతో ఉన్న లక్నో, ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్‌తో పోటీపడాల్సి ఉంటుంది...

12 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న పంజాబ్ కింగ్స్, తన తర్వాతి మ్యాచుల్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌లతో తలబడనుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్‌కి ప్లేఆఫ్స్ ఛాన్సులు ఉంటాయి. అలాగే పంజాబ్ చేతుల్లో ఓడితే ఢిల్లీ, సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటాయి...

వరుసగా ఐదు మ్యాచుల్లో గెలిచి, ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్... ఇక ప్లేఆఫ్స్ చేరాలంటే బీభత్సమైన అదృష్టం కలిసి రావాల్సిందే. సన్‌రైజర్స్ హైదరాబాద్, తన తర్వాతి మ్యాచుల్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్‌లతో మ్యాచులు ఆడనుంది. ఈ రెండు గెలిచినా, 7 విజయాలు మాత్రమే ఉంటాయి. టాప్ 4లో ముగించడం కష్టమవుతుంది...

click me!