ఆ విషయంలో రోహిత్ కంటే మాహీయే బెస్ట్... ముంబైకీ, చెన్నై సూపర్ కింగ్స్‌కీ మధ్య తేడా ఇదే...

First Published May 9, 2022, 3:33 PM IST

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎవరంటే ముందుగా రోహిత్ శర్మ పేరునే చెబుతారు క్రికెట్ ఫ్యాన్స్, విశ్లేషకులు. కారణం ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా 9 సీజన్లలో ఐదు సార్లు టైటిల్ గెలిచాడు రోహిత్ శర్మ. అయితే సీఎస్‌కేపై రెండేళ్లు బ్యాన్ పడకపోయి ఉంటే ఎమ్మెస్ ధోనీ ఖాతాలో కూడా ఐదు లేదా ఆరు టైటిల్స్ ఉండేవంటారు మాహీ ఫ్యాన్స్...

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్ అయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానాల్లో ఉండడం విశేషం... మెగా వేలం ఎఫెక్ట్‌తో ఈ ఇరు జట్లూ, 2022 సీజన్‌లో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయాయి...

ముంబై ఇండియన్స్ 10 మ్యాచుల్లో వరుసగా 8 మ్యాచులు ఓడిన తర్వాత రెండు ఊరట విజయాలు అందుకుంటే 8 మ్యాచుల తర్వాత కెప్టెన్సీ పగ్గాలను తిరిగి ఎమ్మెస్ ధోనీకి ఇచ్చాక 11 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుంది చెన్నై...

Latest Videos


ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 91 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్, పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి ఎగబాకింది. దీంతో ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీని మరోసారి ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఆయన అభిమానులు...

2020 సీజన్‌లో ఐదోసారి టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ లేకుండా బరిలో దిగింది. ఈ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది సన్‌రైజర్స్...

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా లేకుండా బరిలో దిగింది చెన్నై సూపర్ కింగ్స్. 2021 సీజన్‌లో సీఎస్‌కే టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన దీపక్ చాహార్ ఇప్పటికే గాయం కారణంగా దూరం కావడం, జడ్డూకి కూడా విశ్రాంతి ఇవ్వడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు...

దీపక్ చాహార్, రవీంద్ర జడేజా వంటి ఇద్దరు మ్యాచ్ విన్నర్లు లేకుండా బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయాన్ని అందుకోవడంతో ఫ్యాన్స్ ఫుల్లు ఖుష్ అవుతున్నారు...

మ్యాచ్ విన్నర్లు లేకపోయినా ఎలా గెలవాలో మహేంద్ర సింగ్ ధోనీకి బాగా తెలుసని, ఆ విషయంలో రోహిత్ శర్మ కంటే మాహీ చాలా ముందు ఉన్నాడని అంటున్నారు ఫ్యాన్స్... సీజన్ ఆరంభం నుంచి ధోనీ కెప్టెన్‌గా ఉండి ఉంటే, సీఎస్‌కే పొజిషన్ వేరేలా ఉండేదని కామెంట్లు చేస్తున్నారు...

హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్ వంటి ప్లేయర్లను వేలానికి వదిలేసిన ముంబై ఇండియన్స్, 2022 సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచిన విషయం తెలిసిందే...

click me!