ఐపీఎల్ 2022 సీజన్‌లో దుమ్మురేపుతున్న సీనియర్లలో పేసర్ ఉమేశ్ యాదవ్ ఒకడు. ఐపీఎల్ 2022 మెగా వేలం తొలి రౌండ్‌లో అమ్ముడుపోని ఉమేశ్ యాదవ్, రెండో రౌండ్‌లో బేస్ ప్రైజ్‌కి అమ్ముడుపోయిన విషయం తెలిసిందే..
అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా ఒడిసిపట్టుకున్నాడు ఉమేశ్ యాదవ్. ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్, తొలి ఓవర్‌లోనే వికెట్ తీశాడు.
211
ఐపీఎల్ 2022 సీజన్ మొదటి నాలుగు మ్యాచుల్లో తొలి ఓవర్‌లోనే వికెట్లు తీసిన ఉమేశ్ యాదవ్... మొత్తంగా 7 మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు...
311
బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపిస్తున్న ఉమేశ్ యాదవ్, 173+ స్ట్రైయిక్ రేటుతో 40 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి... రెండు సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...
411
‘టీమిండియాలో ఇప్పుడు చాలా హెవీ కాంపిటీషన్ ఉంది. అందరం కలిసి కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాం. ఐపీఎల్‌లో పర్ఫామ్ చేస్తే టీమిండియాకి ఆడొచ్చని అందరికీ తెలుసు...
511
అందుకే ఐపీఎల్‌లో అందరూ బాగా ఆడాలని కష్టపడతారు. నేను మాత్రమే కాదు, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, భువీ... ఇలా చాలా బౌలర్లు ఐపీఎల్‌లో ఉన్నారు...
611
ఐపీఎల్ ముగిసే వరకూ ఎవరైతే బాగా ఆడతారో, వచ్చే మ్యాచుల్లో పర్ఫామెన్స్ కూడా బట్టి భారత జట్టు ఆడేవారిని సమయమే నిర్ణయిస్తుంది. ఇలాంటి కాంపిటీషన్ మంచిదే...
711
ఓ వయసు వచ్చిన తర్వాత కూడా టీమ్‌లోకి రావాలనే కోరిక ఉంటే, ఎంత కష్టపడడానికైనా సిద్ధపడాలి. టీమిండియాలో ప్లేస్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే కసి... పోటీ వల్లే పెరుగుతుంది...
811
టీ20 వరల్డ్ కప్ 2022 గురించి నేను ఇప్పుడే ఆలోచించడం లేదు. వరల్డ్ కప్ దగ్గర పడుతోంది. అయితే వరల్డ్ కప్ ఆడే జట్టును సెలక్టర్లే నిర్ణయించాలి, మేనేజ్‌మెంట్ డిసైడ్ చేయాలి...
911
నా పర్ఫామెన్స్ బాగుందని వాళ్లు అనుకుంటే, సెలక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు నేనైతే దాని గురించి ఆలోచించడం లేదు. కేవలం ఐపీఎల్‌పైనే ఫోకస్ పెట్టాను...
1011
వరల్డ్ కప్ కంటే ముందు వైట్ బాల్ క్రికెట్‌లో రాణించాలి. అందుకే ముందు వీటిపైనే ఫోకస్ పెట్టాను. ఓ ఫాస్ట్ బౌలర్‌గా నా గోల్స్ ఎప్పుడూ షార్ట్ టర్మ్ ఉంటాయి...
1111
నా శరీరంపై నేను బాగా శ్రద్ధ పెడతాను. ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్ తీసుకుంటా. స్కూల్ టైం నుంచి ఫిజిక్‌పై శ్రద్ధ పెట్టాను. బౌలింగ్ వేయడానికి ఇది చాలా అవసరం...’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్...