కేన్ మామ, వార్నర్ భయ్యా, బెయిర్‌స్టో బాబాయ్... ఇప్పుడు ఆ లిస్టులో చేరిన మార్క్‌రమ్! పేరు వింటే..

Published : Apr 19, 2022, 12:41 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో తొలి రెండు మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన తీరు చూసినవాళ్లు ఎవ్వరైనా ఈ జట్టు... సీజన్ మొత్తంలో కనీసం మూడు, నాలుగు మ్యాచులైనా గెలుస్తుందా? అని అనుమానించారు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచుల్లో గెలిచి, అదిరిపోయే కమ్ ‌బ్యాక్ ఇచ్చింది ఆరెంజ్ ఆర్మీ...

PREV
17
కేన్ మామ, వార్నర్ భయ్యా, బెయిర్‌స్టో బాబాయ్... ఇప్పుడు ఆ లిస్టులో చేరిన మార్క్‌రమ్! పేరు వింటే..

నచ్చిన ప్లేయర్, ఏ దేశం వాడైనా మనవాడిగా, మనలోవాడిగా మార్చుకోవడం, మలుచుకోవడం తెలుగువారి ప్రత్యేకత. ఇంతకుముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన డేవిడ్ వార్నర్‌ని డేవిడ్ భాయ్, వార్నర్ భయ్యా... అని అప్యాయంగా పిలిచేవాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్...

27

ఆ తర్వాత 2018 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ని ఫైనల్ చేర్చిన కేన్ విలియంసన్‌ని ‘కేన్ మామ’ అని, ‘రేలంగి మామయ్య’ అని ముద్దుగా పిలుస్తుంటారు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ ప్లేయర్లు కూడా విలియంసన్‌ని డ్రెస్సింగ్ రూమ్‌లో ‘కేన్ మామ’ అని పిలవడం విశేషం...
 

37

అలాగే 2019 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చేరిన ఇంగ్లాండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో కూడా తక్కువ కాలంలోనే తెలుగువారికి దగ్గరైపోయాడు. బెయిర్‌స్టోని జానీ భాయ్, బెయిర్‌స్టో బాబాయ్, ఇంకా ముద్దుగా ‘బైరెడ్డి బాబాయ్’ అని పిలిచేవాళ్లు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్...

47

ఈ సీజన్‌లో నిలకడైన ప్రదర్శన కనబరుస్తూ, సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు సౌతాఫ్రికా బ్యాటర్ అయిడిన్ మార్క్‌రమ్...
 

57

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్, పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 27 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేశాడు...

67

అయిడిన్ మార్క్‌రమ్‌కి టీమ్ డైరెక్టర్ టామ్ మూడీ ప్రత్యేక కానుకను అందిస్తున్న వీడియోను పోస్టు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... అతని పేరు చివర ‘నాయుడు’ జోడించి... సఫారీ బ్యాటర్‌ని తెలుగోడిగా మార్చేసింది...

77

ఆరెంజ్ ఆర్మీ తీరు చూస్తుంటే... నికోలస్ పూరన్ పేరు చివర రెడ్డి, మార్కో జాన్సెన్ పేరు చివర చౌదరి వంటి తోకలను జోడించేలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు సన్‌రైజర్స్ అభిమానులు... 
 

click me!

Recommended Stories