శ్రేయాస్ అయ్యర్‌కి ఆ విషయంలో అన్యాయం... అధికారికంగా ప్రకటించినా పట్టించుకోని బీసీసీఐ...

Published : Mar 04, 2022, 12:26 PM IST

ఐపీఎల్... ఎందరో క్రికెటర్ల జీవితాలను మార్చేసిన క్రికెట్ లీగ్. ఐపీఎల్ కారణంగానే జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్ వంటి ఎందరో క్రికెటర్లు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వగలిగారు...

PREV
111
శ్రేయాస్ అయ్యర్‌కి ఆ విషయంలో అన్యాయం... అధికారికంగా ప్రకటించినా పట్టించుకోని బీసీసీఐ...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏకంగా నాలుగు జట్లు కొత్త కెప్టెన్లతో బరిలో దిగబోతున్న విషయం తెలిసిందే. గత సీజన్‌తో పోలిస్తే, ఈ సీజన్‌లో ఇది రెట్టింపు...

211

పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ ఎంపిక కాగా... లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకి కెఎల్ రాహుల్, గుజరాత్ టైటాన్స్‌కి హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు...

311

గత సీజన్‌లో ఫైనల్ చేరి, రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యాడు. 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్ చేర్చిన అయ్యర్‌ను, వేలంలో రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్...

411

అయితే తాజాగా విడుదలైన ఐపీఎల్ 2022 ప్రోమోలో మాత్రం శ్రేయాస్ అయ్యర్‌కి ఓ విషయంలో అన్యాయం జరిగిందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

511

ప్రోమో ఆఖర్లో  ఐపీఎల్ 2022 సీజన్ ఆడబోయే 10 జట్ల కెప్టెన్లను చూపించారు. మూడు జట్లు మాత్రం కెప్టెన్ల బదులు కీ ప్లేయర్లను చూపించాయి... 

611

ఐపీఎల్ 2022 సీజన్‌కి ఆర్‌సీబీ ఇంకా కెప్టెన్‌ని ప్రకటించలేదు. ఫాఫ్ డుప్లిసిస్‌కి ఆర్‌సీబీ కెప్టెన్సీ దక్కొచ్చని తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. అలాగే మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ కూడా రేసులో ఉన్నారు... 

711

అందుకే ఆర్‌సీబీ కెప్టెన్ స్థానంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీయే కనిపించాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ స్థానంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఉండడం విశేషం... 

811

సీఎస్‌కే కెప్టెన్ ఎమ్మెస్ ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ అని ప్రచారం జరుగుతుండగా, వచ్చే సీజన్‌లో రవీంద్ర జడేజాకే కెప్టెన్సీ పగ్గాలు దక్కుతాయని జోరుగా ప్రచారం జరుగుతోంది...

911

పంజాబ్ కింగ్స్ సారథిగా మయాంక్ అగర్వాల్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్‌గా కెఎల్ రాహుల్ కనిపించారు...

1011

కేకేఆర్ ఇప్పటికే అధికారికంగా శ్రేయాస్ అయ్యర్, తమ ఐపీఎల్ 2022 సీజన్ కెప్టెన్ అని ప్రకటించినా... అతన్ని ప్రోమోలో చూపించకపోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి...

1111

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్థానంలో కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్‌, IPL2022 ప్రోమోలో కనిపించడం విశేషం. 

click me!

Recommended Stories