మొదటి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్‌కి షాక్... గాయంతో స్కానింగ్‌కి ఇషాన్ కిషన్...

Published : Mar 27, 2022, 05:59 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో మొదటి మ్యాచ్ పూర్తికాకముందే ముంబై ఇండియన్స్‌కి భారీ షాక్ తగిలేలా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 48 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్, తన అద్భుత ఇన్నింగ్స్‌తో పలు రికార్డులను బ్రేక్ చేసేశాడు...

PREV
19
మొదటి మ్యాచ్‌లోనే ముంబై ఇండియన్స్‌కి షాక్... గాయంతో స్కానింగ్‌కి ఇషాన్ కిషన్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆఖరి రెండు మ్యాచుల్లో 50+ స్కోర్లు చేసిన ఇషాన్ కిషన్, మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 215 పరుగులు చేశాడు. మూడో ఇన్నింగ్స్‌ల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన ముంబై బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు ఇషాన్...

29

సచిన్ టెండూల్కర్ గతంలో మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 201, 198 పరుగులు చేసి టాప్‌లో ఉండేవాడు. ఇషాన్ కిషన్, సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసి టాప్‌లోకి వెళ్లిపోయాడు...

39

ఐపీఎల్‌లో ఓపెనర్‌గా 60+ సగటు నమోదు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్ సగటు 63.60 కాగా, కెఎల్ రాహుల్ 51.78, రుతురాజ్ గైక్వాడ్ 49.06 సగటుతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు...

49

ఐపీఎల్‌లో ఓపెనర్‌గా 500లకు పైగా పరుగులు, 50కి పైగా సగటు, 150కి పైగా స్ట్రైయిక్ రేటు ఉన్న ఏకైక ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఇషాన్ కిషన్...

59

ఐపీఎల్ 2020 నుంచి ఓపెనర్‌గా వచ్చిన 7 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సార్లు 50+ పరుగులు చేశాడు ఇషాన్ కిషన్.  శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఓ ఫుల్ టాస్ బాల్ నేరుగా ఇషాన్ కిషన్ కాలిని బలంగా తాకింది. 

69

ఇషాన్ కిషన్ నొప్పితో తలడిల్లుతున్న సమయంలోనే టిమ్ డేవిడ్ సింగిల్ కోసం పిలుపు ఇవ్వడంతో ఉరుకులు పరుగులు తీశాడు...

79

ఇషాన్ కిషన్ కాలి బొటనవేలుకి బాల్ బలంగా తాకడంతో గాయం తీవ్రత తెలుసుకునేందుకు అతన్ని వెంటనే స్కానింగ్‌కి తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎక్కువైతే, ఇషాన్ కిషన్ సీజన్ మొత్తానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది...

89

గాయం కారణంగా ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్‌కి రాకపోవడంతో అతని స్థానంలో రిజర్వ్ ప్లేయర్ ఆర్యన్ జుయల్, ముంబై ఇండియన్స్‌కి వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు.

99

ఐపీఎల్ మెగా వేలంలో రూ.15.25 కోట్ల భారీ ధరకు ఇషాన్ కిషన్‌ను తిరిగి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. ఇషాన్ దూరమైతే, ఆ ప్రభావం ముంబైపై తీవ్రంగానే పడనుంది. 

click me!

Recommended Stories