ముంబై ఇండియన్స్‌లో తెలుగు ప్లేయర్... ఎవరీ తిలక్ వర్మ, మెగా వేలంలో కోటిన్నర దక్కించుకుని...

Published : Mar 27, 2022, 04:52 PM IST

ఫైవ్ టైమ్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌లో ఓ యంగ్ ప్లేయర్‌కి తుదిజట్టులో చోటు దక్కడం అంటే సాధారణ విషయం కాదు. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ తిలక్ వర్మ, ఐపీఎల్ ఆరంగ్రేటం చేశాడు...

PREV
110
ముంబై ఇండియన్స్‌లో తెలుగు ప్లేయర్... ఎవరీ తిలక్ వర్మ, మెగా వేలంలో కోటిన్నర దక్కించుకుని...

అన్‌మోల్‌ప్రీత్ సింగ్ అవుటైన తర్వాత టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు తిలక్ వర్మ. నాగర్‌కోటి బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన తిలక్ మర్మ, చూడచక్కని షాట్లతో క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిలో పడ్డాడు...
 

210

ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఫోర్ బాదిన తిలక్ వర్మ... ఆ తర్వాతి బంతికి భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. 15 బంతుల్లో 3 ఫోర్లతో 22 పరుగులు చేసిన తిలక్ వర్మ, తన మొదటి మ్యాచ్‌లో ఇంప్రెసివ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు...

310

ఇంతకు ఎవరీ తిలక్ వర్మ... ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఈ తెలుగు కుర్రాడి కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి.  సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌‌తో పాటు  ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్లు ఎన్ తిలక్ వర్మను కొనుగోలు చేసేందుకు పోటీపడ్డాయి.

410

ఐపీఎల్ 2022 మెగా వేలంలో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలతో వచ్చిన తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ జట్టు, రూ.1.70 కోట్లకు కొనుగోలు చేసింది...

510

అండర్-19 వరల్డ్ కప్ 2020 టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు తిలక్ వర్మ. ఆ టోర్నీలో మంచి పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు..

610

2002, నవంబర్ 8న హైదరాబాద్‌లో జన్మించిన తిలక్ వర్మ వయసు 19 ఏళ్లు. ఆరు అడుగులకు పైగా పొడవుండే ఈ కుర్రాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్... 

710

టాపార్డర్‌లో బ్యాటింగ్ చేసే తిలక్ వర్మ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, బ్రేవిస్ వంటి రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్లతో లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్‌గా వాడొచ్చని ముంబై ఇండియన్స్ భావించి..  అతన్ని కోటిన్నర పెట్టి కొనుగోలు చేసింది...

810

దేశవాళీ క్రికెట్ టోర్నీల్లో టీ20 ఫార్మాట్‌లో 15 మ్యాచులు ఆడిన తిలక్ వర్మ, 143.77 సగటుతో 381 పరుగులు చేశాడు. తిలక్ వర్మ యావరేజ్ 30.. 15 మ్యాచుల్లో 28 ఫోర్లు, 17 సిక్సర్లు బాదిన తిలక్ వర్మ, మూడు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. అతని అత్యధిక స్కోరు 75 పరుగులు...

910
tilak varma

16 లిస్టు ఏ మ్యాచులు ఆడిన తిలక్ వర్మ, 784 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 156 పరుగులు నాటౌట్. ఇందులో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సగటు 52.25... బౌలింగ్‌లోనూ 5 వికెట్లు తీశాడు...

1010

విజయ్ హాజారే ట్రోఫీ 2022 టోర్నీలో హైదరాబాద్ తరుపున ఆడి, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 139 పరుగులు చేసిన తిలక్ వర్మ, ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించి... ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ద్వారా ఆరంగ్రేటం చేశాడు...

Read more Photos on
click me!

Recommended Stories