ఊపిరి పీల్చుకోండి, ఆరెంజ్ క్యాప్‌కి అసలైన మొగుడు వస్తున్నాడు... విరాట్ కోహ్లీ గురించి రవిశాస్త్రి కామెంట్...

Published : Mar 27, 2022, 04:32 PM ISTUpdated : Mar 27, 2022, 04:36 PM IST

గత దశాబ్దంలో క్రికెట్ ప్రపంచంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లోనూ 6 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లో గత 9 సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు విరాట్...

PREV
18
ఊపిరి పీల్చుకోండి, ఆరెంజ్ క్యాప్‌కి అసలైన మొగుడు వస్తున్నాడు... విరాట్ కోహ్లీ గురించి రవిశాస్త్రి కామెంట్...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు ఆర్‌సీబీ కెప్టెన్‌గా ఇదే ఆఖరి సీజన్ అని ప్రకటించిన విరాట్ కోహ్లీ, సాధారణ ప్లేయర్‌గా 2022 సీజన్ ఆడబోతున్నాడు...

28

చెన్నై సూపర్ కింగ్స్ తరుపున సాధారణ ప్లేయర్‌గా ఆడిన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో కమ్‌బ్యాక్ ఇచ్చాడు ఎమ్మెస్ ధోనీ... దీంతో విరాట్ నుంచి అదిరే కమ్‌బ్యాక్ ఆశిస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్...

38

ఐపీఎల్ 2016 సీజన్‌లో కెప్టెన్‌గా ఆర్‌సీబీని ఫైనల్ చేర్చిన విరాట్ కోహ్లీ, ఆ సీజన్‌లో 973 పరుగులు చేసి... ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గానూ టాప్‌లో ఉన్నాడు...

48

ఐపీఎల్ 2016 సీజన్‌లో ఆర్‌సీబీ ఓపెనర్‌గా వచ్చిన విరాట్ కోహ్లీ, కెరీర్‌లో ఏకైక ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఈసారి విరాట్ కోహ్లీపై ఆ రేంజ్ అంచనాలే ఉన్నాయి...

58

‘ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వస్తే, కచ్చితంగా ఆరెంజ్ క్యాప్ పోటీలో ఉంటాడు. విరాట్ ఫామ్‌లో ఉంటే ఆరెంజ్ క్యాప్‌కి అసలైన మొగుడు అవుతాడు...

68

విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా వచ్చినా, మిడిల్ ఆర్డర్‌లో వచ్చే సమస్యేమీ ఉండదు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఆర్‌సీబీ మంచి ప్లేయర్లను కొనుగోలు చేసింది...

78

గ్లెన్ మ్యాక్స్‌గెల్ గత సీజన్‌లో చక్కగా ఆడాడు. దినేశ్ కార్తీక్‌, ఫాఫ్ డుప్లిసిస్‌లకు ఎంతో క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. టీమ్ కాంబినేషన్‌ ముఖ్యం...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

88

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి మ్యాచ్‌లో మార్చి 27న పంజాబ్ కింగ్స్‌తో తలబడనుంది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్, ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో ఆర్‌సీబీ బరిలో దిగబోతున్నాయి..

Read more Photos on
click me!

Recommended Stories