అరుదైన రికార్డుకు అర్థ సెంచరీ దూరంలో హిట్ మ్యాన్.. కోహ్లిని అధిగమించడానికి సూపర్ ఛాన్స్

Published : Apr 06, 2022, 03:11 PM IST

TATA IPL 2022: ముంబై ఇండియన్స్ సారథి హిట్ మ్యాన్ అరుదైన రికార్డుకు అర్థ సెంచరీ దూరంలో ఉన్నాడు. ఈ రికార్డును గతంలో భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సాధించాడు. బుధవారం కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచులో  గనక హిట్ మ్యాన్ 54 పరగులు చేస్తే... 

PREV
17
అరుదైన రికార్డుకు అర్థ సెంచరీ దూరంలో హిట్ మ్యాన్.. కోహ్లిని అధిగమించడానికి సూపర్ ఛాన్స్

టీ20లలో పరుగుల వరద పారించే  ఆటగాళ్లలో ముంబై ఇండియన్స్ సారథి  రోహిత్ శర్మ ఒకడు. సారథిగా వ్యూహాలు పన్నుతూ జట్టును విజయవంతం చేయడమే గాక ఓపెనర్ గా వచ్చి మెరుపులు మెరిపిస్తాడు. 

27

ఇప్పటికే పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్న హిట్ మ్యాన్.. ఇప్పుడు మరో అరుదైన ఘనతకు  అర్థ సెంచరీ దూరంలో నిలిచాడు.  బుధవారం కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగే  మ్యాచులో గనక  రోహిత్ 54 పరుగులు చేసినా చాలు. 

37

టీ20లలో  (ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచులు కలిపి) రోహిత్ ఇప్పటివరకు 9,946 పరుగులు చేశాడు.  మరో 54 పరుగులు చేస్తే.. విరాట్ కోహ్లి తర్వాత టీ20లలో పదివేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. 

47

విరాట్ కోహ్లి  తన టీ20 కెరీర్ లో ఇప్పటివరకు 10,331 పరుగులు సాధించి  ఇండియాలో ఈ ఫార్మాట్ లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ గా ఉన్నాడు.  అతడి తర్వాత స్థానంలో రోహిత్ ఉన్నాడు. 

57

మరి బుధవారం కేకేఆర్ తో జరిగే మ్యాచులో 54 పరుగులు చేస్తే రోహిత్ పదివేల క్లబ్ లో చేరినట్టే. అయితే గత రెండు మ్యాచులలో రోహిత్.. 41, 10 పరుగులు మాత్రమే చేశాడు.  మరి నేటి మ్యాచులో ఎంతవరకు రాణిస్తాడనేది ఆసక్తికరం. 

67

భారత్ లో టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు సాధించిన టాప్-6 ఆటగాళ్లు వీరే. విరాట్ కోహ్లి (10,331), రోహిత్ శర్మ (9,946), శిఖర్ ధావన్ (8,867), సురేశ్ రైనా (8,821), రాబిన్ ఊతప్ప  (7,133), ఎంఎస్ ధోని (7,024) ఉన్నారు.

77

ఇవే కాదు.. మరో రెండు మైల్ స్టోన్లకు కూడా రోహిత్ సమీపంలో ఉన్నాడు.  కేకేఆర్ తో మ్యాచులో 5 ఫోర్లు కొడితే రోహిత్ శర్మ.. ఐపీఎల్ లో 500 బౌండరీలు కొట్టిన ఆటగాడవుతాడు. ఒక్క బౌండరీ కొట్టినా ముంబై తరఫున 400  ఫోర్లు  బాదిన బ్యాటర్ గా రికార్డులకెక్కుతాడు. ముంబైతో చేరకముందు రోహిత్.. డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్ తో ఆడిన విషయం తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories