IPL2022 మెగా వేలంలో అండర్-19 వరల్డ్ కప్ కుర్రాళ్లు... బెంగాల్ మంత్రి మనోజ్ తివారి కూడా..

Published : Feb 01, 2022, 04:45 PM ISTUpdated : Feb 03, 2022, 07:26 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలానికి షార్ట్ లిస్టు చేయబడిన ప్లేయర్లలో కొందరు అండర్-19 వరల్డ్‌కప్ ప్లేయర్లకు కూడా చోటు దక్కింది. సౌతాఫ్రికా సీనియర్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్‌తో పాటు 17 ఏళ్ల ఆఫ్ఘాన్ స్పిన్నర్ నూర్ అహ్మద్... ఐపీఎల్ 2022 మెగా వేలంలో పాల్గొనబోతున్నారు...

PREV
19
IPL2022 మెగా వేలంలో అండర్-19 వరల్డ్ కప్ కుర్రాళ్లు... బెంగాల్ మంత్రి మనోజ్ తివారి కూడా..

42 ఏళ్ల వయసులో ఐపీఎల్‌కి పేరు రిజిస్టర్ చేయించుకున్న ఇమ్రాన్ తాహీర్, అతి పెద్ద వయస్కుడిగా నమోదు కాగా, 17 ఏళ్ల ఆఫ్ఘాన్ ప్లేయర్ నూర్ అహ్మద్, ఐపీఎల్ 2022 సీజన్‌‌లో వేలానికి రానున్న అతి పిన్న వయస్కుడు...

29

సౌతాఫ్రికా యంగ్ సెన్సేషన్, ‘బేబీ ఏబీడీ’ డివాల్డ్ బ్రేవిస్‌, ఇండియా ప్లేయర్లు సమీర్ రిజ్వీ, ఆకీబ్ ఖాన్, ఆఫ్ఘాన్ ప్లేయర్ ఇజరుల్లాహక్ లింటాట్... 18 ఏళ్ల వయసులో ఐపీఎల్ 2022 మెగా వేలంలో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు...

39

వెస్టిండీస్‌లో అండర్-19 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ఆడుతున్న భారత జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న యశ్ ధుల్‌తో పాటు ఆ జట్టులోని ఏడుగురు ప్లేయర్లు... ఐపీఎల్ 2022 మెగా వేలానికి షార్ట్ లిస్టు చేయబడ్డారు...

49

ఓపెనర్ హర్నూర్ సింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లు కుశాల్ తంబే, రాజ్ భవ, రాజ్‌వర్థన్ హంగర్కేర్, బౌలర్లు విక్కీ వత్సల్, వాసు వత్స్... ఐపీఎల్ 2022 మెగా వేలంలో రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో రాజవర్థన్ హంగర్కేర్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలు కాగా, మిగిలిన అందరి బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు...

59

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, క్రీడా శాఖ మంత్రిగా పదవి చేపట్టిన క్రికెటర్ మనోజ్ తివారి కూడా ఐపీఎల్ 2022 వేలానికి రిజిస్టర్ చేయించుకున్నాడు. మనోజ్ తివారి బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు...

69

గత సీజన్‌లో రూ.15 కోట్ల భారీ ధర దక్కించుకున్న న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ కేల్ జెమ్మీసన్, ఈసారి ఐపీఎల్‌లో పాల్గొనడం లేదు. మెగా వేలానికి అతను పేరు రిజిస్టర్ చేయించుకోకపోవడం విశేషం...

79

అలాగే ఏడేళ్ల నిషేధం తర్వాత గత ఐపీఎల్‌లో పేరు నమోదు చేసుకున్న షార్ట్ లిస్ట్ కాలేకపోయిన శ్రీశాంత్‌కి ఈసారి అవకాశం దక్కింది. షార్ట్ లిస్టు చేసిన ప్లేయర్ల జాబితాలో శ్రీశాంత్ పేరు ఉండడంతో ఈసారి మనోడు వేలానికి రాబోతున్నాడు...

89

గత ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయడంతో రెండు నెలల పాటు ఖాళీగా గడిపిన టెస్టు ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా కూడా ఈసారి మెగా వేలానికి రిజిస్టర్ చేసుకున్నారు. పూజారా, శ్రీశాంత్‌ల బేస్ ప్రైజ్ రూ.50 లక్షలు...

99

సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఐపీఎల్ 2022 మెగా వేలంలో పాల్గొనబోతున్నాడు. గత ఏడాది ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసిన అర్జున్ టెండూల్కర్ బేస్ ప్రైజ్ రూ.20 లక్షలు...

click me!

Recommended Stories