IPL2022 మెగా వేలంలోకి వచ్చే తొలి సెట్ ప్లేయర్లు వీరే... అశ్విన్, వార్నర్, ధావన్, అయ్యర్‌‌తో పాటు...

Published : Feb 01, 2022, 03:51 PM ISTUpdated : Feb 03, 2022, 07:26 PM IST

ఐపీఎల్ 2022 మెగా వేలానికి సైరన్ మోగింది. మెగా వేలానికి మొత్తంగా 1214 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేయించుకోగా, ఆ జాబితా నుంచి 590 మందిని షార్ట్ లిస్ట్ చేశాయి ఫ్రాంఛైజీలు... వేలంలో ముందుగా వచ్చే మార్క్యూ సెట్ ప్లేయర్లు వీరే...

PREV
110
IPL2022 మెగా వేలంలోకి వచ్చే తొలి సెట్ ప్లేయర్లు వీరే...  అశ్విన్, వార్నర్, ధావన్, అయ్యర్‌‌తో పాటు...

రవిచంద్రన్ అశ్విన్: చెన్నై సూపర్ కింగ్స్‌లో కెరీర్ ఆరంభించిన రవిచంద్రన్ అశ్విన్, గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపటల్స్ జట్టు తరుపున ఆడాడు. గత రెండు సీజన్లుగా ఏటా రూ.7.6 కోట్లు తీసుకుంటున్న అశ్విన్‌, ఈసారి ఆ రేటుకి తగ్గకుండా ధర దక్కించుకునే అవకాశం ఉంది...

210

ట్రెంట్ బౌల్ట్: ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బౌలర్ ట్రెంట్ బౌల్ట్. బుమ్రాతో కలిసి మ్యాచ్ టర్నింగ్ స్పెల్స్ వేసిన ట్రెంట్ బౌల్ట్‌ని రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై. అయితే ఈసారి ట్రెంట్ బౌల్ట్‌కి ఎంత లేదన్నా రూ.7-10 కోట్ల వరకూ ధర పలకవచ్చని అంచనా..

310

ప్యాట్ కమ్మిన్స్: ఐపీఎల్ 2020 సీజన్ వేలంలో రూ.15.5 కోట్ల భారీ ధర దక్కించుకున్నాడు ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్. గత రెండు సీజన్లలో పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన కమ్మిన్స్‌కి ఈసారి రూ.8-12 కోట్ల వరకూ ధర దక్కొచ్చని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ విశ్లేషణ...

410

క్వింటన్ డి కాక్: రోహిత్ శర్మతో కలిసి ముంబై ఇండియన్స్‌‌కి ఓపెనర్‌గా వ్యవహరించాడు క్వింటన్ డి కాక్. గత రెండు సీజన్లలో రూ.2.8 కోట్లు అందుకున్న డి కాక్, ఈసారి వేలంలో రూ.5-8 కోట్ల వరకూ పలకవచ్చు...

510

శిఖర్ ధావన్: సీనియర్ మోస్ట్ ఓపెనర్ శిఖర్ ధావన్, గత మూడు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. శిఖర్ ధావన్‌కి రూ.5.2 కోట్లు చెల్లించిన ఢిల్లీ, ఈసారి గబ్బర్ లక్ బాగుంటే అంతకు రెట్టింపు ధర దక్కడం కాయం...

610

ఫాఫ్ డుఫ్లిసిస్: కేవలం 2 పరుగుల తేడాతో ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ కోల్పోయాడు సీఎస్‌కే ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్. సీఎస్‌కే కేవలం రూ.1.6 కోట్లు మాత్రం డుప్లిసిస్‌కి చెల్లించింది. అయితే ఈసారి డుప్లిసిస్‌కి రూ.4-7 కోట్ల వరకూ ధర దక్కొచ్చని అంచనా...

710

శ్రేయాస్ అయ్యర్: ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ఏటా రూ.7 కోట్లు తీసుకున్న అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్, ముంబై, ఆర్‌సీబీ జట్లు పోటీపడబోతున్నాయని అంచనా. అయ్యర్ అదృష్టం బాగుంటే రూ.12-16 కోట్ల వరకూ ధర దక్కించుకోవచ్చు...

810

కగిసో రబాడా: ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఐపీఎల్ 2020 సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలిచాడు కగిసో రబాడా. డెత్ ఓవర్లలో పరుగులు కట్టడి చేయడంలో దిట్ట అయిన రబాడా కోసం అన్ని ఫ్రాంఛైజీలు పోటీపడడం ఖాయం. డీసీ నుంచి రబాడా రూ.4.2 కోట్లు పొందాడు, అయితే ఈసారి అతనికి రెట్టింపు దక్కే ఛాన్సులు ఉన్నాయి.

910

మహ్మద్ షమీ: పంజాబ్ కింగ్స్ తరుపున ఆడిన మహ్మద్ షమీకి ఆ జట్టు రూ.4.8 కోట్లు చెల్లించింది. మహ్మద్ షమీ ఈసారి రూ.4-6 కోట్ల వరకూ దక్కించుకోవచ్చని అంచనా...

1010

డేవిడ్ వార్నర్: సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌‌కి ఈసారి డిమాండ్ భారీగానే ఉంది. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా రూ.12.5 కోట్లు దక్కించుకున్నాడు వార్నర్. ఈసారి వార్నర్ భాయ్ కోసం ఫ్రాంఛైజీలు పోటీపడితే ఈ మార్కును ఈజీగా దాటేస్తాడు...
 

click me!

Recommended Stories