మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా... ఆ విషయంలో ఇద్దరూ ఒక్కటే! - రవిశాస్త్రి కామెంట్...

Published : May 24, 2022, 05:59 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్లుగా కెరీర్ ప్రారంభించిన వారిలో మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా కూడా ఉన్నారు. ఈ ఇద్దరితో పాటు కెప్టెన్లుగా ఈ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫాఫ్ డుప్లిసిస్, హార్ధిక్ పాండ్యా ప్లేఆఫ్స్‌కి చేరుకుంటే మయాంక్, జడ్డూ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయారు...

PREV
111
మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా... ఆ విషయంలో ఇద్దరూ ఒక్కటే! - రవిశాస్త్రి కామెంట్...

గత రెండు సీజన్లలో పంజాబ్ కింగ్స్‌కి బ్యాట్స్‌మెన్‌గా అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చాడు మయాంక్ అగర్వాల్. అయితే ఈ సీజన్‌లో కెప్టెన్సీ ప్రెషర్ కారణంగా మయాంక్ బ్యాటు నుంచి రావాల్సిన మెరుపులు రాలేదు...

211

ఈ సీజన్‌లో 13 మ్యాచుల్లో 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు మయాంక్ అగర్వాల్... ఆరంభంలో ఓపెనర్‌గా వచ్చిన మయాంక్, ఆ తర్వాత తన స్థానాన్ని జానీ బెయిర్‌స్టోకి త్యాగం చేసి కొన్ని మంచి మార్కులు కొట్టేశాడు...

311

అలాగే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై కూడా కెప్టెన్సీ ప్రభావం తీవ్రంగా పడింది. సీఎస్‌కే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత బ్యాట్స్‌మెన్‌గా కానీ, బౌలర్‌గా కానీ, ఆఖరికి ఫీల్డర్‌గా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు జడ్డూ...

411
Ravindra Jadeja

8 మ్యాచుల్లో రెండు విజయాలు అందించిన తర్వాత సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రవీంద్ర జడేజా గాయం కారణంగా ఐపీఎల్ 2022 సీజన్ మధ్యలో నుంచి తప్పుకున్నాడు...

511

‘మయాంక్ అగర్వాల్, రవీంద్ర జడేజా... ఇద్దరూ ఒకే పొజిషన్‌లో ఉన్నారు. ఇద్దరికీ కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు, అయితే ఐపీఎల్‌లో కెప్టెన్లుగా ప్రమోషన్ పొందారు.. మయాంక్ అగర్వాల్ అంటే నాకు చాలా గౌరవం...
 

611

ఎందుకంటే అతను చాలా పట్టుదలగా ఆడతాడు. చాలా నిజాయితీగా ఉంటాడు. ఎలాంటి త్యాగాలు చేయడానికైనా వెనకాడడు. అయితే కెప్టెన్సీ విషయానికి వచ్చేసరికి అతను కెప్టెన్‌గా పనికి రాడు...

711

కెప్టెన్సీ ఇవ్వడం వల్ల అతని కెరీర్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే అతను ఐపీఎల్‌లో పరుగులు చేయని కారణంగా భారత జట్టులో చోటు కోల్పోయాడు. అదీ కూడా టెస్టుల్లో...

811

ఎందుకంటే భారత జట్టుకి పోటీ చాలా ఎక్కువగా ఉంది. తుది 11 మందిలోనే కాదు, 15 మందిలో ఉన్నాడంటే సూపర్ ఫామ్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే తీసి పక్కనబెట్టేస్తారు. 

911

కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత రవీంద్ర జడేజా ఎలా ఆడాడో, మయాంక్ అగర్వాల్ పరిస్థితి కూడా అదే. అయితే జడ్డూతో పోలిస్తే పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా మయాంక్ కొన్ని ఎక్కువ విజయాలు అందుకుని ఉండవచ్చు...

1011

ఈ ఏడాది ఫ్రాంఛైజీలన్నింటికీ ఓ మంచి గుణపాఠం దొరికింది. కెప్టెన్‌ని ఎంచుకునేటప్పుడు చాలా స్మార్ట్‌గా ఉండాలి. ఇప్పుడు మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా కొనసాగించాలా? తీసేయాలా? అనేది పంజాబ్‌కి పెద్ద తలనొప్పి కావచ్చు...

1111
Mayank Agarwal

కెప్టెన్‌ని మారిస్తే సీజన్‌కో కెప్టెన్‌ని మార్చినట్టు అవుతుంది. మయాంక్ అగర్వాల్‌ని కెప్టెన్‌గా కొనసాగిస్తూ, అతనిలోని బెస్ట్ బ్యాటర్‌ని మిస్ చేసుకోవాల్సి వస్తోంది.. ’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

click me!

Recommended Stories